సమంత ఎంగేజ్ మెంట్ రింగ్ ఏమైంది?

విడాకుల తర్వాత చేతికున్న ఆ వజ్రపుటుంగరాన్ని తీసేసింది సమంత. అలా తీసేసిన ఉంగరాన్ని అందమైన పెండెంట్ గా మార్చుకున్నట్టు తెలుస్తోంది.

ఏళ్ల కిందటి సంగతి. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత అతడికి, అక్కినేని కుటుంబానికి చెందిన చాలా వస్తువుల్ని, బహుమతుల్ని సమంత వెనక్కు పంపించేసిందంటూ కథనాలు వచ్చాయి. అందులో నిజమెంతో మనకు తెలియదు కానీ, కొన్నింటిని మాత్రం ఆమె తన దగ్గరే ఉంచుకుందనేది వాస్తవం.

అందులో ఒకటి నిశ్చితార్థం ఉంగరం. సమంతతో నిశ్చితార్థం జరిగినప్పుడు ఆమె వేలికి ఖరీదైన డైమండ్ రింగ్ తొడిగాడు చైతూ. 3 క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ ను చాలా సందర్భాల్లో సమంత బయటపెట్టింది కూడా.

మరి ఇప్పుడా ఎంగేజ్ మెంట్ రింగ్ ఏమైంది? విడాకుల తర్వాత చేతికున్న ఆ వజ్రపుటుంగరాన్ని తీసేసింది సమంత. అలా తీసేసిన ఉంగరాన్ని అందమైన పెండెంట్ గా మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ పెండెంట్ ను బంగారు చైన్ కు తగిలించి అప్పుడప్పుడు మెడలో ధరిస్తుంటుందంట.

ఇలా వస్తువుల్ని మార్చి వాడుకోవడం సమంతకు ఇదే తొలిసారి కాదు. తన తెల్లటి వెడ్డింగ్ గౌన్ ను ఆమె నల్లటి బాడీకాన్ డ్రెస్ గా మార్చేసింది. అప్పట్లో సోషల్ మీడియా దీనికి రివెంజ్ డ్రెస్ అనే ట్యాగ్ కూడా ఇచ్చింది.

అయితే ఇలా ఎన్ని గుర్తులు మారుస్తున్నప్పటికీ, తన ఒంటిపై ఉన్న పచ్చబొట్టును మాత్రం ఆమె తొలిగించుకోలేకపోతోంది. మరీ ముఖ్యంగా రొమ్ముకు కాస్త కింద భాగంలో, నడుముకు పైన వేయించుకున్న నాగచైతన్య పచ్చబొట్టు ఇంకా అలానే ఉంది.

7 Replies to “సమంత ఎంగేజ్ మెంట్ రింగ్ ఏమైంది?”

  1. ఎవరూ శాశ్వతం కాదు, ముఖ్యంగా మీలా అద్దాలమేడ జీవులకి. పచ్చబొట్లు అవసరమా?

Comments are closed.