జ‌గ‌న్ చేతిలో వైసీపీ భ‌విష్య‌త్‌!

వైసీపీ భ‌విష్య‌త్ జ‌గ‌న్ మార్పుపై ఆధార‌ప‌డి వుంది. జ‌గ‌న్‌లో మార్పు వ‌స్తే, విజ‌యం దానిక‌దే దాసోహం అవుతుంది.

వైసీపీ అంటే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సొంత ఆస్తికాదు. ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అభిమానించే పార్టీ. కేవ‌లం 11 అసెంబ్లీ, నాలుగు పార్ల‌మెంట్ స్థానాల‌కే ప‌డిపోయిన అత్యంత ద‌య‌నీయ స్థితిలోనూ 40 శాతం ఓటు బ్యాంక్‌ను సంపాదించిన రాజ‌కీయ పార్టీ. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణం. ఓట‌మికి కుంగిపోతే ఏ రాజ‌కీయ పార్టీ రాణించ‌లేదు. ఓట‌మిని జీర్ణించుకోలేని రాజ‌కీయ పార్టీ, గెలుపును ఆస్వాదించ‌లేదు.

ఓట‌మిని గెలుపున‌కు సోపానంగా మార్చుకోవాలి. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఘోర ప‌రాజ‌యంపాలై, గెలుపు కోసం క‌సితో ఉన్నారు. వైసీపీని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఊరికే ఆరాటం వుంటే స‌రిపోదు, అందుకు త‌గ్గ పోరాటం చేయాలి. వైసీపీ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న వేళ ఆ పార్టీ గ‌తం, వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్ గురించి చ‌ర్చిద్దాం.

2011, మార్చి 12న ఇడుపుల‌పాయ‌లోని వైఎస్సార్ స‌మాధి వ‌ద్ద వైసీపీ రాజ‌కీయ పార్టీగా ప్రాణం పోసుకుంది. రాజ‌కీయ పార్టీ స్థాపించే నాటికి జ‌గ‌న్ వ‌య‌సు 39 ఏళ్లు. అప్ప‌టికి ఆయ‌న ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబునాయుడు రాజ‌కీయ అనుభ‌వం కూడా ఇంచుమించు అన్నే సంవ‌త్స‌రాలు. జ‌గ‌న్ రాజ‌కీయ పార్టీ స్థాపించేనాటికి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం బ‌లంగా వుంది.

వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ పార్టీ నాటికి క‌డ‌ప పార్ల‌మెంట్ స‌భ్యుడు. త‌న తండ్రి ఆక‌స్మిక మ‌ర‌ణం, కాంగ్రెస్‌తో విభేదాలు… వెర‌సి రాజ‌కీయ పార్టీ స్థాప‌న‌కు దారి తీశాయి. వైఎస్సార్‌పై ప్ర‌జ‌ల్లో అభిమానం, ప్రియ‌త‌మ నాయ‌కుడి కుమారుడైన జ‌గ‌న్‌పై సానుభూతిగా మారాయి. అయితే జ‌గ‌న్ నేతృత్వంలో ఆవిర్భ‌వించిన వైసీపీతో త‌మ‌కు ప్ర‌మాదం వుంద‌ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మొద‌ట్లోనే గుర్తించాయి.

ఈ నేప‌థ్యంలో మొగ్గ‌ద‌శ‌లోనే జ‌గ‌న్‌ను తుంచేయాల‌ని ఆ పార్టీలు త‌మ‌వైన దారుల్లో ప్ర‌య‌త్నించాయి. దీంతో జ‌గ‌న్‌పై అక్ర‌మాస్తుల కేసులు. సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. 2012లో జ‌గ‌న్ అరెస్ట్‌, 16 నెల‌ల పాటు జైలు జీవితం. దీంతో జ‌గ‌న్ రాజ‌కీయంగా ఖ‌తం అవుతాడ‌ని అనుకుంటే, మ‌రింత బ‌ల‌ప‌డ్డారు. కేవ‌లం జ‌గ‌న్ కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని విడ‌గొట్టార‌నే ప్ర‌చారం లేక‌పోలేదు. 2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాస్త‌… తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా విడిపోవాల్సి వ‌చ్చింది.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే వైసీపీ వైపు వెళ్లిన 18 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు, ఉప ఎన్నిక‌లు …రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం. 15 చోట్ల వైసీపీ గెలుపు. కేవ‌లం మూడు చోట్ల మాత్ర‌మే కాంగ్రెస్ అభ్య‌ర్థుల గెలుపు. తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగుస్తున్న సంద‌ర్భంలోనూ ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి కొండా సురేఖ‌పై బీఆర్ఎస్ అభ్య‌ర్థి చావు త‌ప్పి క‌న్నులొట్ట‌పోయిన చందంగా గెల‌వ‌డం గ‌మ‌నార్హం.

ఆ త‌ర్వాత విభ‌జిత ఏపీలో 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగాయి. టీడీపీ-బీజేపీ కూట‌మిగా ఏర్ప‌డిగా, ఆ మ‌ధ్యే పార్టీ స్థాపించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా ఆ రెండు పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు. విస్తృతంగా ప్ర‌చారం చేశారు. వైసీపీ ఒంట‌రిగా పోటీ చేసింది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్ మొద‌టిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంత‌గా అనుభ‌వం లేని జ‌గ‌న్ త‌మ‌కు త‌ట్టుకోలేర‌ని చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ నేత‌లు అనుకున్నారు.

కానీ విష‌య ప‌రిజ్ఞానంతో ప్ర‌భుత్వ విధానాల్ని అసెంబ్లీ వేదిక‌గా తిప్పి కొట్ట‌డాన్ని చూసి చంద్ర‌బాబు, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు త‌దిత‌ర రాజ‌కీయ ఉద్ధండులకు దిమ్మ‌తిరిగింది. దీంతో జ‌గ‌న్‌ను అసెంబ్లీ వేదిక‌గా మాన‌సికంగా టార్గెట్ చేశారు. అయినా చ‌లించ‌లేదు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల‌ను టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో వైసీపీ ప‌ని అయిపోయింద‌నే మైండ్‌గేమ్‌కు పాల్ప‌డ్డారు. అయినా జ‌గ‌న్ చెక్కుచెద‌ర‌లేదు.

అసెంబ్లీలో మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌న్న కార‌ణంతో ఏకంగా ఆ స‌మావేశాల‌ను జ‌గ‌న్ బ‌హిష్క‌రించారు. 2017, న‌వంబ‌ర్ 6న ఇడుపుల‌పాయ నుంచి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించారు. ఇచ్ఛాపురం వ‌ర‌కు 14 నెల‌ల పాటు యాత్ర సాగించి. మొత్తం 3,648 కి.మీ పాద‌యాత్ర‌ను జ‌గ‌న్ చేసి, రికార్డు నెల‌కొల్పారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వెల్లువెత్తిన ప్ర‌జాద‌ర‌ణ‌… 2019లో వైసీపీ అధికారంలోకి రాబోతుంద‌న్న అభిప్రాయాన్ని క‌లిగించింది.

వైసీపీ శ్రేణులు కాంక్షించిన‌ట్టు 2019లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌స‌భ సీట్ల‌ను సాధించి ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బ‌హుశా ఈ ఘ‌న విజ‌య‌మే వైసీపీ పాలిట శాపంగా మారింద‌న్న అభిప్రాయాన్ని క‌లిగించింది. సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో హామీ మేర‌కు నిజాయతీగా అమ‌లు చేశార‌న్న మంచి పేరు ప్ర‌భుత్వానికి వ‌చ్చింది. అయితే ఇత‌ర‌త్రా విష‌యాల్లో జ‌గ‌న్ చ‌ర్య‌లు పిచ్చి చేష్ట‌ల్ని త‌ల‌పించాయి. మూడు రాజ‌ధానులు, చంద్ర‌బాబు అరెస్ట్‌, మండ‌లి ర‌ద్దు ప్ర‌తిపాద‌న‌ల్ని కేంద్రానికి పంప‌డం, అలాగే చేసిన అభివృద్ధిని చెప్సుకోలేక‌పోవ‌డం, ల్యాండ్ టైటిలింగ్ చ‌ట్టం విష‌యంలో ముఖ్యంగా రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌లేక‌పోవ‌డం, సొంత పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల దౌర్జ‌న్యాల్ని అదుపు చేయ‌లేక‌పోవ‌డం త‌దిత‌ర అంశాలు ….వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి దారి తీశాయి. కేవ‌లం 11 ఎమ్మెల్యే, 4 లోక్‌స‌భ సీట్ల‌కే వైసీపీ ప‌రిమిత‌మైంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ తిరిగి మొద‌టి నుంచి ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్టాల్సి వ‌చ్చింది. వైసీపీ పున‌ర్ వైభ‌వం తెచ్చుకోవాలంటే, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌పై ఆధార‌ప‌డి వుంది. మొద‌ట‌గా తామెందుకు ఘోరంగా ఓడిపోయామో ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాలి. లోపాల్ని స‌రిదిద్దుకోవ‌డానికి ఇగోకు వెళ్లాల్సిన ప‌నిలేదు. అయితే ఈవీఎంల వ‌ల్లే ఓడిపోయామ‌ని నిజంగా జ‌గ‌న్ న‌మ్ముతుంటే మాత్రం ఆయ‌న్ను ఎవ‌రూ మార్చ‌లేరు. త‌న ప‌రిపాల‌న‌లోని లోపాల వ‌ల్లే ఓడిపోయాన‌నే వాస్త‌వాల్ని జ‌గ‌న్ గుర్తించ‌డంలోనే విజ‌యం ఆధార‌ప‌డి వుంటుంది.

జీవితంలో ఎద‌గాలంటే ముందుగా ఎవ‌రైనా త‌మ మ‌న‌సుల్ని గెల‌వాల్సి వుంటుంది. త‌మ‌లోని నెగెటివిటీని గుర్తించి, దాని నుంచి ఎలా భ‌య‌ప‌డాలో ఆలోచించాలి. కానీ వైసీపీ విష‌యంలో అలాంటి మార్పు క‌నిపించ‌డం లేద‌న్న అభిప్రాయం ఆ పార్టీని గాఢంగా ప్రేమించే వాళ్లో వుంది. ఇప్ప‌టికీ త‌న చుట్టూ స‌రైన టీమ్ పెట్టుకోలేద‌న్న భావ‌న వుంది. వేంప‌ల్లెకు చెందిన ఎస్వీ స‌తీష్‌రెడ్డిని కోట‌రీలోకి తీసుకోవ‌డం గుడ్డిలో మెల్ల‌. జ‌గ‌న్ చేసిన మంచి ప‌నుల్లో ఇదొక‌టి. అలాగే ఉత్త‌రాంధ్ర‌కు క‌న్న‌బాబును రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్‌గా నియ‌మించ‌డం స‌రైందే. మండ‌లి వైసీపీ ప‌క్ష నాయ‌కుడిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను నియ‌మించ‌డం చాలా మంచిప‌ని.

అయితే అంద‌రూ మారుతున్నారే గానీ, జ‌గ‌న్‌లో మాత్రం వైసీపీ శ్రేణులు ఆశించిన రీతిలో మార్పు కాన‌రావ‌డం లేదు. వైసీపీ శ్రేణుల్ని, నాయ‌కుల్ని జ‌నంలోకి పంప‌డం వ‌ర‌కే ఆయ‌న ప‌రిమితం అవుతున్నారు. తాను కూడా వెళ్లాల‌నే విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిన‌ట్టున్నారు. ఒక్క‌టి మాత్రం నిజం. కూట‌మి గొప్ప‌త‌నం ఏమీ లేదు. జ‌గ‌న్ అజ్ఞానం, అహంకారం, లెక్క‌లేనిత‌న‌మే త‌మ‌కు శ్రీ‌రామ ర‌క్ష‌గా కూట‌మి నేత‌లు భావిస్తున్నారు. కూట‌మి విజ‌య‌మ‌ల్లా జ‌గ‌న్ బ‌ల‌హీన‌త‌లు. దాన్ని జ‌గ‌న్ క‌నుక్కునేంత వ‌ర‌కూ ఆయ‌న‌కు, ఆయ‌న్ను న‌మ్ముకున్నోళ్ల‌కు క‌ష్ట‌న‌ష్టాలు త‌ప్ప‌వు. వైసీపీ భ‌విష్య‌త్ జ‌గ‌న్ మార్పుపై ఆధార‌ప‌డి వుంది. జ‌గ‌న్‌లో మార్పు వ‌స్తే, విజ‌యం దానిక‌దే దాసోహం అవుతుంది. పిల్లిమెడ‌లో గంట క‌ట్టేదెవ‌ర‌నే సామెత చందాన‌…జ‌గ‌న్‌లో మార్పు తీసుకొచ్చేదెవ‌రు?

58 Replies to “జ‌గ‌న్ చేతిలో వైసీపీ భ‌విష్య‌త్‌!”

  1. sir కోసం విభజన చేశారా? ఎలా బాబు?

    అన్యాయంగా కేసు లో ఇరికించారా? జప్తు చేసిన 43,000 కోట్లు ఎవరివి, ఎక్కడ నుంచి వచ్చాయి? ప్రజలు కి అవగాహన పెరిగింది, వాళ్ళని ఇక మీ మాయ మాటలతో మభ్య పెట్టలేరు!!

  2. sir కోసం విభజన చేశారా? ఎలా బాబు?

    అన్యాయంగా కేసు లో ఇరికించారా? జప్తు చేసిన 4*3kకోట్లు ఎవరివి, ఎక్కడ నుంచి వచ్చాయి? ప్రజలు కి అవగాహన పెరిగింది, వాళ్ళని ఇక మీ మాయ మాటలతో మభ్య పెట్టలేరు!!

  3. sir కోసం విభజన చేశారా? ఎలా బాబు?

    అన్యాయంగా కేసు లో ఇరికించారా? జప్తు చేసిన ఆస్తులు ఎవరివి, ఎక్కడ నుంచి వచ్చాయి? ప్రజలు కి అవగాహన పెరిగింది, వాళ్ళని ఇక మీ మాయ మాటలతో మభ్య పెట్టలేరు!!

  4. మా సింగల్ సింహం పాలనలో లోపాలా?? పాపాలా??

    ఇచ్చిన హామీలు.. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా 99.9% అమలు చేసి ఇంటింటికీ, ప్రతీ ఒంటికీ మేలు చేసి ఆంధ్రలో పేదలని కోటేశ్వరులని చేసాడు..

    ప్రజల్లో ప్రేమ, ఆప్యాయత చెక్కు చెదరలేదు.. కేవలం E’VM ఓట్లేస్తే ఓడిపోయామ్.. అతిమంచితనం, అతి నిజాయితీగా 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు.. ఈసారి 175/175 కొడతాం కొట్టి చూపిస్తాం..

  5. ఇన్నాళ్లు “సిద్ధం” సభలు జరుపుకొన్నారు..

    ఇకపై,, “వర్ధంతి” సభలు జరుపుకొంటారు..

    అదే జగన్ రెడ్డి పార్టీ భవిషత్తు..

  6. పిల్లిమెడలో గంట కట్టేదెవరు.. బలిసిందా GA, మా అన్న ని పిల్లి అంటున్నావ్.

  7. When your party was in power, you have praised the same decisions as great decisions and supported them. Why such a u-turn now? This clearly shows how inconsistent you are. Maybe, by showing this article, you will claim you are a neutral website. No one is going to believe you, you loser.

  8. Oka vela chesina development publicity ante,…. Pot holes road kaada hoardings petti fish markets , mutton kottlu pettam ani rasthe kaaladha janalaki.

    Aarogya sri , oka district head quarters lo 20 private hospitals vunnayi…. Govt hospitals evariki labham.

  9. వాడి లక్ష్యం అధికారం, డబ్బు..తద్వారా కేస్ ల నుండి రక్షణ..రెండూ వచ్చాయి.. ఇప్పుడు అధికారం వున్నా లేకపోయినా.. అవినీతి సొమ్ముతో లాయర్లు ని మేపుతూ ..వ్యవస్థ లని manage చేస్తూ కేస్ లని ముందుకు కదలనివ్వకుండా అలా సేద తీరుతున్నాడు. వాడికేం రాష్ట్రం పట్ల..ప్రజల పట్ల ఎటువంటి కన్సర్న్ వుండదు.. నువ్వు తప్పితే వాడ్ని లేపాలని చూసేవాడు ఎవడు లేడు.

  10. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని బతిమాలుకుంటే వచ్చిన విజయం అది.. అధికారం లోకి వచ్చాక తెలిసింది అన్నయ్య కి ఉన్న టాలెంట్ ఎంతో అందుకే ఆ టాలెంట్ కి తగ్గట్టుగా 11 ఇచ్చారు ప్రజలు..

  11. సింగల్ సింహం అని చెప్పుకునేటప్పుడు జగన్ చేతిలోనే ఉంటుంది వైసీపీ భవిష్యత్తు. కష్టాల్లో తోడుఉండిన చెల్లిని తరిమేశాడు కదా.

  12. “ధన్యవాదాలు జగన్ గారు – ప్రజల అభిమానానికి తగిన బహుమతి!”

    అయ్యో! 2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారి పాలనకు ప్రజలు ఎలాంటి గొప్ప గౌరవం ఇచ్చారో చూశారా? అవును, ప్రజలు ఆయన అద్భుతమైన పాలనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ 11 అసెంబ్లీ స్థానాల గౌరవంతో తలదించుకునేలా చేశారు. ఇంకేముంది, మిగతా 164 స్థానాలను చకాచకా టిడిపి-జనసేన-బిజెపి కూటమికి అందించి, జగన్ గారికి స్నేహపూర్వకంగా “ఇంకో ఐదేళ్లు రెస్ట్ తీసుకోండి” అని సందేశం ఇచ్చేశారు.

    అమరావతి – అద్భుతమైన శూన్యత!

    మూడు రాజధానుల ఆలోచనతో జగన్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఓ అద్భుతమైన నిలుపుదల ఇచ్చారు. అమరావతి రైతులను గడగడలాడించి, భూములు తీసుకుని, చివరకు ఏదీ చేసిపెట్టక అద్భుతమైన ఖాళీ భవిష్యత్తును అందించారు. రైతులు వేలాది రోజులు రోడ్డుపై మిగిలినా, జగన్ గారు మాత్రం “విశాఖ రాజధాని అవుతుందని” ఒప్పించేందుకు బాగా కష్టపడ్డారు. కానీ చివరికి, ప్రజలు తమ ఓట్లతో ఆయన వాగ్దానాలను ఎక్కడ పెట్టాలో స్పష్టంగా చూపించారు!

    రిషికొండ – “పర్యాటక అభివృద్ధి” అంటే ఇదే!

    విశాఖలోని రిషికొండ ప్రాంతాన్ని టూరిజం అభివృద్ధి చేస్తామంటూ ఇంటింటికి పత్రికలొచ్చినట్లు డిక్లరేషన్ ఇచ్చారు. కానీ, ఏం జరిగింది? అక్కడ పర్యాటక అభివృద్ధి కంటే ఎక్కువగా రహస్య భవన నిర్మాణాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అభివృద్ధి తీరును ప్రజలు బయటకు తీయడంతో, చివరకు “ఇది బహిరంగ ప్రదేశం కాదు, ప్రత్యేక ఆకర్షణ” అంటూ నిప్పుకీట్లు వెదజల్లారు. ఇప్పుడు ఆయన పోయిన తరువాత, కొత్త ప్రభుత్వం ఆ భవనాల్లో నిజంగా ఏమి ఉంది అనే అంశంపై ఆరా తీస్తే ఏమవుతుందో చూడాలి!

    న్యాయవ్యవస్థపై మోసగాళ్ల ఆరోపణలు

    ఎవరైనా సీఎం అయితే, న్యాయవ్యవస్థను గౌరవిస్తారు. కానీ, జగన్ గారు సూటిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఆరోపించి కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియనట్టుగా వ్యవహరించి, “ఇక మనం న్యాయవ్యవస్థనే టార్గెట్ చేద్దాం” అన్నట్లు వ్యవహరించారు. ప్రజలు దీన్ని ఎంతగా అభిమానించారో చూస్తే అర్థమవుతుంది – ఓట్ల రూపంలో ఆయన పార్టీకి అభినందన లేఖ పంపేశారు!

    ముగింపు – ప్రజలు చెప్పిన తుది తీర్పు

    జగన్ గారి పాలన ఎంత ప్రమాదకరం, అప్రజాస్వామికం గా ఉందో ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అందుకే, వైఎస్సార్సీపీ భవిష్యత్తు తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా అంధకారంలోకి వెళ్లేలా తీర్మానించేశారు. ఇకపై జగన్ గారు విశ్రాంతి తీసుకుంటూ, “నేను చేసిన తప్పేంటో” అనే ఆలోచన చేస్తారని ఆశిద్దాం. కానీ, ప్రజలు మాత్రం ఇంకొకసారి ఈ తప్పిదాన్ని చప్పున గుర్తించి, మరోసారి చేయకుండా చూస్తారు!

  13. రే, అత్యంత ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, పదిహేను సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను పట్టించుకోకపోవడం!

    జగనన్న నంది అవార్డు స్థాయిలో నటిస్తే, తన చుట్టూ ఉన్న వెదవలు ఆస్కార్ అవార్డు స్థాయిలో నటించారు. జగనన్న నువ్వు ఎన్ని సర్కస్ ఫీట్‌లు చేసినా, కార్యకర్తలను నిజాయితీగా పట్టించుకుంటేనే మళ్లీ గెలుస్తావు. లేకపోతే లేదు.

    ఇంక ఏమాత్రం నటించినా ఇక అస్సలు చాన్సే లేదు, జగన్ అన్నాయ్ నీ బతుకు అస్సాంకే!

    ఇట్లు,

    నీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్త

  14. ఆనాడు వున్న విషయం పరిజ్ఞానం ఇప్పుడేమైంది? ఇప్పుడు మైండ్ దొబ్బిందా? అసలు విషయం అది కాదు. అబద్దాలు , కోడికత్తి , బాబాయ్ గుండెపోటు డ్రామాలు, మోడీ , కెసిఆర్ సహాయాలు అన్నీ కలిసొచ్చాయి. ఒక్కసారి అధికారం ఇస్తే వీడి అసలు సత్తా ఏందో ప్రజలకి తెలిసింది .

    పాత పాడుబడ్డ ఇంటిని మరమ్మతు చెయ్యటం కంటే కొత్త ఇంటిని నిర్మించటం చాలా తేలిక. వైసీపీ పరిస్థితి కూలిపోనున్న పాడుబడ్డ ఇల్లు లాగా వుంది.

  15. Jagan marakapoina…mee vote athanikega !!!

    Aa vishayam annayaki telusu…

    Mee andariki annaye dikku…vere dikku ledu… congress nilabadadu..

    Tdp janasena lo place ledu…

    Tittina…tannina…annaya kalla daggara padundali anthe..

    Annaya chesina pratidaniki aha..oho ani colouring ichhhi…ippudemo… ahamkaram ..pichhi chestalu antava..??

  16. అబద్దాలు, శవాలు, సమాధుల మీద నిర్మించిన పార్టీ ఆ స్మశానం లోనే సమాధి అవ్వటం ఖాయం.

  17. anni vedava veshalu vesina tharuvatha adhikaram loki vachhi guddi eddhhu kanna heenamga paripalichaadu….andhuke….janalu thanni tharimesaru…malli adhikaram ichhe paristiti ledhu….veedu maaradu…

Comments are closed.