త్రివిక్రమ్ కు బన్నీ రిక్వెస్ట్!

ఒక సినిమా స్టార్ట్ చేసి కొంత చేసిన తరువాత ఈ సినిమా కూడా స్టార్ట్ చేయాలన్నదే తన ఆలోచన అని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది.

తన కోసం ఒక్క ఆరు నెలలు వేచి వుండమని ఐకాన్ స్టార్ బన్నీ దర్శకుడు త్రివిక్రమ్ ను కోరారు. వెకేషన్ కోసం, బాడీ డీటాక్సినేషన్ కోసం విదేశాలకు వెళ్లిన అల్లు అర్జున్ ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. త్రివిక్రమ్ వెళ్లి కలిసారు. ఐకాన్ స్టార్ కోసం తను తయారు చేసిన కథ ఫైనల్ నెరేషన్ ఇచ్చారు. ఇద్దరి మధ్య కాస్త ఎక్కువ సేపే డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.

వీలయినంత త్వరగా ఓ సినిమా చేసి 2026లో విడుదల చేయాలనుకుంటున్నానని, అలా ప్లాన్ చేసే సినిమా స్టార్ట్ చేసి, కొంత వర్క్ చేసిన తరువాత త్రివిక్రమ్ సినిమా కూడా స్టార్ట్ చేయాలన్నది తన ఆలోచన అని బన్నీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన కోసం ఒక్క ఆరు నెలలు వెయిట్ చేయమని త్రివిక్రమ్ ను కోరినట్లు విశ్వసనీయ వర్గాలబోగట్టా. దానికి త్రివిక్రమ్ సరే అన్నట్లు తెలుస్తోంది.

పారలల్ గా చేసే అవకాశం వుంటే వెయిట్ చేయడానికి తనకు అభ్యంతరం లేదని త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా కాకుండా మొత్తం వేరే సినిమా చేసిన తరువాత తన సినిమా స్టార్ట్ చేయాలంటే చాలా టైమ్ పట్టేస్తుందని వివరించినట్లు తెలుస్తోంది.

ఒక సినిమా స్టార్ట్ చేసి కొంత చేసిన తరువాత ఈ సినిమా కూడా స్టార్ట్ చేయాలన్నదే తన ఆలోచన అని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్రివిక్రమ్ ఎటూ వెళ్లడం లేదు. బన్నీ సినిమా మీదే, బన్నీ సినిమా కోసమే, బన్నీ కోసం చేసిన మైథలాజికల్ టచ్ ప్రాజెక్ట్ ను ఫైన్ ట్యూన్ చేసుకుంటూ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేస్తూ వెయిటింగ్ లో వుంటారు.

6 Replies to “త్రివిక్రమ్ కు బన్నీ రిక్వెస్ట్!”

Comments are closed.