కొణతాలకు మంత్రి పదవి ఇస్తే భేష్!

రాజకీయంగా సీనియర్, సౌమ్యుడు, పాలనాదక్షుడు, సమర్ధవంతమైన నేత సీనియర్ ఇవన్నీ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామక్రిష్ణకు ఉన్న విశేషణాలు.

రాజకీయంగా సీనియర్, సౌమ్యుడు, పాలనాదక్షుడు, సమర్ధవంతమైన నేత సీనియర్ ఇవన్నీ ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామక్రిష్ణకు ఉన్న విశేషణాలు. ఆయన మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రెండు సార్లు ఎంపీగా మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నపుడు కీలకమైన శాఖలను చూశారు. జనసేన నుంచి ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయనకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం రిత్యా మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. ఆయన బీసీ వర్గాలకు ప్రతినిధిగా ఉన్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యధిక శాతం ఉన్న ఒక బలమైన సామాజిక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి దాదాపుగా రెండు దశాబ్దాలుగా మంత్రి పదవి అయితే దక్కలేదు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలలో వారికి కేబినెట్ లో చోటు లేదు

ఆ అసంతృప్తి అలాగే ఉంది. ఆ సామాజిక వర్గం నుంచి జనసేన తరఫున ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా కొణతాల కనిపిస్తారు. ఆయనకు జనసేన నుంచి మంత్రి పదవి ఇస్తే భేష్ అయిన నిర్ణయంగా ఉంటుందని అంటున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్రలో జనసేన మరింతగా విస్తరించడానికి కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు. పైగా బీసీలకు జనసేన ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా కూడా ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో జనసేన అధినాయకత్వం ఆలోచిస్తే కొణతాలకు మంత్రి పదవి దక్కినట్లే అంటున్నారు.

9 Replies to “కొణతాలకు మంత్రి పదవి ఇస్తే భేష్!”

  1. నాగబాబు కి ఇవ్వొద్దు అనేది నీ ఇంటెన్షన్, అది డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా

  2. కొణతాల రామకృష్ణ గారికి రాజశేఖర్ రెడ్డి గారితో మంచి అనుబంధం వుండెంది

    ఆయన వైసీపీ లో ఎక్కువ కాలం వుండలేకపోయారు

    ఇప్పుడేమో ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు

Comments are closed.