సమరసింహారెడ్డి చూశాం. వీరసింహారెడ్డినీ చూశాం. మధ్యలో వచ్చిన అర్జున్ రెడ్డిని కూడా చూశాం. ఇదే ఊపులో జగ్గారెడ్డిని కూడా చూస్తారా? ఈ పేరు వినగానే ఎవరికైనా తెలంగాణ రాజకీయ నాయకుడు గుర్తొస్తారు. నిజమే.. ఆయనే ఈ జగ్గారెడ్డి.
తన పేరు మీదే సినిమా ప్రకటించారు జగ్గారెడ్డి. ఈ సందర్భంగా సినిమా టైటిల్ తో ఆయన రిలీజ్ చేసిన పోస్టర్లు భలే ఫన్నీగా ఉన్నాయి. కొన్ని సినిమాల్లోని స్టిల్స్, పోస్టర్లు తీసుకొని మార్ఫింగ్ చేసినట్టు అనిపిస్తోంది తప్ప, ఒరిజినల్ గా ఫొటోషూట్ చేసి తయారుచేసినట్టు అనిపించడం లేదు. పోస్టర్ లో ఓ యువ జంటను కూడా చూడొచ్చు.
ఈ సంగతి పక్కనపెడితే, తనది పొలిటికల్ సినిమానే ఉంటున్నారు జగ్గారెడ్డి. తను ఏ అంశాన్ని టచ్ చేశానో తెలియాలంటే సినిమా చూడాలంటున్నారు. రాజకీయాల్లో తనను ఎవ్వరూ తొక్కలేరని, తనకు సింపతీ అక్కర్లేదని, పోరాడతానని చెబుతున్న జగ్గారెడ్డి.. సినిమాతో తన భావజాలాన్ని ప్రజలందరికీ చేరవేరుస్తానని అంటున్నారు.
ఈ సినిమాలో ప్రేమికుల్ని కాపాడే పాత్రలో కనిపించబోతున్నారు జగ్గారెడ్డి. మాఫియాను ఎదిరించి, ప్రేమజంట పెళ్లి చేసే నాయకుడిగా కనిపిస్తారు. ఇకపై సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కొనసాగుతానంటున్నారు.
One Reply to “జగ్గా రెడ్డి.. ఇది పేరు కాదు, సినిమా”
Comments are closed.