మహేష్-రాజమౌళి.. సైన్స్ ఫిక్షనా!

సినిమాకు కొబ్బరికాయ కొట్టిన విషయమే రాజమౌళి బయటకు చెప్పలేదు. ఇలాంటి కీలకమైన విషయాన్ని అతడు బయటపెడతాడనుకోవడం అత్యాశే అవుతుంది.

ఏమో చెప్పలేం.. ఇండియానా జోన్స్ తరహా ఈ మూవీలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. దీనికి కారణం సినిమా షూటింగ్ నుంచి లీకైన ఒకే ఒక్క క్లిప్.

ఈ సినిమాలో విలన్ పాత్రధారి పృధ్వీరాజ్ సుకుమార్ ఓ కుర్చీలో కూర్చుంటాడు. అతడి ఎదురుగా మహేష్ నిల్చుంటాడు. ఆర్మీ దుస్తుల్లో ఉన్న వ్యక్తి వచ్చి మహేష్ ను ముందుకు తోస్తే, విలన్ ముందు మోకాళ్లపై కూర్చుంటాడు మహేష్.

సరిగ్గా ఇక్కడే విలన్ కూర్చున్న కుర్చీ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సరిగ్గా ఎక్స్-మెన్ సిరీస్ సినిమాలో ఓ వ్యక్తి ఇదే కుర్చీలో కనిపిస్తాడు. ఆ సినిమాలో మాత్రమే కాదు, మరికొన్ని సైన్స్-ఫిక్షన్ సినిమాల్లో కూడా ఇదే తరహా కుర్చీ కనిపిస్తుంది.

అలాంటి కుర్చీని విలన్ కోసం వాడాడంటే, కచ్చితంగా మహేష్ సినిమాలో కూడా సైన్స్-ఫిక్షన్ టచ్ కాస్త ఉన్నట్టుందనేది నెటిజన్ల డౌటానుమానం. సినిమాకు కొబ్బరికాయ కొట్టిన విషయమే రాజమౌళి బయటకు చెప్పలేదు. ఇలాంటి కీలకమైన విషయాన్ని అతడు బయటపెడతాడనుకోవడం అత్యాశే అవుతుంది.

అన్నట్టు ఈ సినిమాకు సంబంధించి ఈ వారంలో ప్రెస్ మీట్ ఉంటుందని అంతా ఆశించారు. కానీ రాజమౌళి-మహేష్ తమ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. వచ్చే వారం నుంచి మరింత బిజీ అవ్వబోతున్నారు.

4 Replies to “మహేష్-రాజమౌళి.. సైన్స్ ఫిక్షనా!”

Comments are closed.