జాన్వీ కపూర్ కు నైట్ షిఫ్టులు మొదలయ్యాయి. ఈరోజు నుంచి ఆమె నిద్రలేని రాత్రులు గడపబోతోంది. ఇదంతా రామ్ చరణ్ సినిమా కోసమే.
రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు సంబంధించి ఈరోజు నుంచి మరో షెడ్యూల్ ప్రారంభమైంది. అది నైట్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ లో చరణ్-జాన్విపై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు.
నిజానికి ఈ సినిమాకు నైట్ షెడ్యూల్స్ కొత్త కాదు. ఆల్రెడీ అలాంటి షెడ్యూల్ ఒకటి పూర్తి చేశారు. కాకపోతే అప్పుడు చరణ్ ఒక్కడే పాల్గొన్నాడు. హీరోయిన్ జాన్వి కపూర్ కు ఇదే తొలి నైట్ షెడ్యూల్.
ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. పెద్దగా గ్యాప్స్ ఇవ్వకుండా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు రామ్ చరణ్.
ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ సినిమాల కోసం చాలా టైమ్ కేటాయించిన ఈ హీరో, బుచ్చిబాబు సినిమాను మాత్రం వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Good
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Makeup lekunda vellani manam choodalemu