పులివెందుల పీఎస్‌లో డీఎస్పీ, సీఐపై కేసు న‌మోదు

కూట‌మి ప్ర‌భుత్వంలో వైఎస్ వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్ అయిన ద‌స్త‌గిరికి మంచి ప‌లుకుబ‌డి వుంది.

కూట‌మి ప్ర‌భుత్వంలో వైఎస్ వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్ అయిన ద‌స్త‌గిరికి మంచి ప‌లుకుబ‌డి వుంది. ఇందుకు నిద‌ర్శ‌నం పోలీసు అధికారుల‌పైనే కేసు న‌మోదు కావ‌డం. రాజ‌కీయ ప్ర‌ముఖుడైన వివేకాను హ‌త్య చేశాన‌ని టీవీ స్టూడియోల్లో కూచొని, రొమ్ములు విరుచుకుని కొన్నేళ్లుగా హీరోయిజం ప్ర‌ద‌ర్శిస్తున్న‌దెవ‌రో అంద‌రికీ తెలిసిందే. కూట‌మి అధికారంలోకి రావ‌డంతో అత‌నికి మ‌రింత బ‌లం వ‌చ్చిన‌ట్టైంది.

2023లో వైసీపీ హ‌యాంలో త‌న‌ను ఇబ్బంది పెట్టార‌ని పులివెందుల పోలీస్‌స్టేష‌న్‌లో ద‌స్త‌గిరి ఫిర్యాదు చేశారు. దీంతో పులివెందుల పోలీసులు దేవిరెడ్డి చైత‌న్య‌రెడ్డితో పాటు గ‌తంలో జ‌మ్మ‌ల‌మ‌డుగు డీఎస్పీగా ప‌ని చేసిన నాగ‌రాజు, ఎర్ర‌గుంట్ల సీఐ ఈశ్వ‌ర‌య్య‌, అలాగే క‌డ‌ప జైలు సూప‌రింటెండెంట్ ప్ర‌కాశ్‌పై కేసు న‌మోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వీరిలో చైత‌న్య‌రెడ్డి …వివేకా హ‌త్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి కుమారుడు.

వివేకా కేసులో వైసీపీ నేత‌ల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడాల‌ని నాటి జ‌మ్మ‌ల‌మ‌డుడు డీఎస్పీ నాగ‌రాజు, అలాగే సీఐ ఈశ్వ‌ర‌య్య త‌న‌ను బెదిరించార‌ని ద‌స్త‌గిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. క‌డ‌ప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న‌ప్పుడు సూప‌రింటెండెంట్ ప్ర‌కాశ్ త‌న‌ను ఇబ్బంది పెట్టిన‌ట్టు అత‌ను పేర్కొన్నాడు.

అలాగే వివేకా హ‌త్య కేసులో విచార‌ణాధికారి రాంసింగ్‌కు వ్య‌తిరేకంగా సాక్ష్యం చెప్పాల‌ని త‌న‌ను జైల్లో దేవిరెడ్డి చైత‌న్య‌రెడ్డి బెదిరించిన‌ట్టు ద‌స్త‌గిరి ఫిర్యాదులో పేర్కొన‌డం, పులివెందుల పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇందులో నిజానిజాలేంటో న్యాయ స్థానంలో తేలాల్సి వుంది.

3 Replies to “పులివెందుల పీఎస్‌లో డీఎస్పీ, సీఐపై కేసు న‌మోదు”

  1. జగన్ జమానా లో అదే కేసు లో నిందితులు ఏకంగా ఎంక్వయిరీ చేస్తున్న సి బి ఐ ఆఫీసర్ మీదే కంప్లైంట్ చేసారు మరి, గుర్తులేదా?

Comments are closed.