కూటమి ప్రభుత్వం దాదాపు సగం పాలన పూర్తి చేసుకుంటోంది. గతంలో ఏ ప్రభుత్వంపై లేని వ్యతిరేకత, ఈ ప్రభుత్వంపై జనంలో కనిపిస్తోందనే మాట కొన్ని నెలలుగా వినిపిస్తోంది.
ఇంత త్వరగా చంద్రబాబు సర్కార్‌పై వ్యతిరేకత రావడానికి కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల దోపిడీనే కారణమనే ప్రచారం బలంగా సాగుతూ వస్తోంది. ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలుకాక ముందు ప్రచారం.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది.
రాష్ట్రంలో మున్సిపాల్టీలు, పరిషత్, పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్ విడుదల చేశారు. మొట్టమొదట మున్సిపాల్టీలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది.
ఎవరూ ఊహించని విధంగా మున్సిపాల్టీల్లో వైసీపీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చివరికి కూటమిలో భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ అభ్యర్థులను కూడా టీడీపీ విడిచిపెట్టలేదు.
ఈ దారుణాలు రాయలసీమ, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పూర్తిగానూ, ఇతర ప్రాంతాల్లో స్వల్పంగానూ చోటు చేసుకున్నాయి.
అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అక్కడి వైసీపీ అభ్యర్థుల్ని బెదిరించడానికి సంబంధించిన ఆడియోలు వెలుగు చూశాయి.
మిగిలిన చోట్ల టీడీపీ ప్రజాప్రతినిధుల బెదిరింపులు ఆ రకంగానే సాగినప్పటికీ, బయటికి రాలేదంతే. బెదిరింపులు, దాడులు మాత్రం అన్ని చోట్ల ఒకేలా కొనసాగాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ మాత్రం పర్వాలేదని, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రుల దోపిడీ, అరాచకాల వల్లే చెడ్డపేరు వస్తోందనే విమర్శకు కాలం చెల్లింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాల పుణ్యమా అని తెలుగుదేశం పార్టీకే తీవ్ర నెగెటివ్ అయ్యింది. సహజంగా ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల్లో బలం ఉన్న పార్టీలు రిగ్గింగ్ చేసుకుంటుంటాయి.
కానీ ఈ దఫా టీడీపీ అన్ని అరాచకాల్ని అధిగమించి, తనదైన కొత్త చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.
ఏకంగా రాజకీయ ప్రత్యర్థులెవరినీ నామినేషన్లే వేయనివ్వకుండా టీడీపీ రౌడీలు అడ్డుకున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుశ్చర్యలు లేవు. నామినేషన్లు వేయడానికి వెళ్లిన మహిళలపై సైతం పోలీసుల ఎదుటే దాడులు చేయడం దేశమంతా చూసి, ఆశ్చర్యపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంత దుర్మార్గం సాగుతోందా? అని భారత జాతి ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంది. చంద్రబాబుకు రాజకీయ చరమాంకంలో తీరని మచ్చగా మిగిలింది.
మున్సిపల్స్, అలాగే పరిషత్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీ ఆగడాలతో ఏపీ పరువు కూడా పోయింది. మరీ ముఖ్యంగా అరాచకాలకు కర్త, కర్మ, క్రియ అయిన తెలుగుదేశం పార్టీకి విపరీతమైన చెడ్డపేరు వచ్చింది.
ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రజాప్రతినిధులు పక్కకు పోయారు. యావత్ తెలుగుదేశం పార్టీనే విలన్‌గా ప్రజలు చూసే పరిస్థితి. ఈ దుష్పరిణామాలకు టీడీపీ ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో కాలం జవాబు చెప్పాల్సి వుంది.

గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత లేదు అప్పుడు టిడిపి మీద వ్యతిరేకం గా అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపిని గెలిపించారా జీఏ.
టీడీపీ పోటీ చెయ్యలేదు తెలియదా కర్మ మీ లాంటి వారు టీడీపీ లో ఉండడం టీడీపీ పోటీ లో లేకుంటే అన్ని గెలుస్తారు ఇక్కడ వైస్సార్సీపీ పోటీ లో ఉంది ఇదే తేడా
ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు సిపిఐ పార్టీ తో SDPI పార్టీ తో పొత్తు పెట్టుకోవడం ఎందుకు జీఏ
పొత్తు ఎవరు పెట్టుకున్నారు 175 వైస్సార్సీపీ నే poti చేస్తుంది
మొత్తం అన్ని poti చేసినప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటావు
నమ్మేశాం బాబయ్య..రేపు ఫలితాలు చూసి..టీడీపీ గూండాలు రిగ్గింగ్ అని రాస్తావ్.
చేస్తారు రిగ్గింగ్ GA చెప్పాలిసిన పని లేదు జనాలు చూస్తారు వీడియో కూడా తెస్తున్నారు కదా తీసి
ఇప్పుడు టీడీపీ నే బలి చేసారు కూటమిలో ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి బయటికి వెళ్తాయి అని టాక్ వస్తుంది
పోనీలే
Jagan Anna chesthe rajakeeyam, Jagan chesindanilo 25% kudancheyale…. Maree Jagan Anna emi Antav.
కర్మ ఎవ్వరిని వదలదు
అవునా ..
నువ్వు ఈ కామెంట్ వదలవు
నువు ఈ commen వదలవు
Hahha
Vere comment okati vundi.ayithe OTT lo chuddham le ani
టీడీపీ ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం రాదు, కారణం అందరికీ తెలుసు, కానీ దేవదేవుడు మాత్రం సర్వనాశనం చేస్తాడు
.
మనకు అసలు ముఖ్యమంత్రి పోస్ట్ ఎలా వచ్చింది? ఆ పోస్ట్ అలా రప్పించుకుంటే ఇంకా కింద స్థాయి నాయకులు కూడా మాట వినరు కదా? గట్టిగా అడిగితే నువ్వు పోస్ట్ లోక్కోవొచ్చు మేము చేస్తే తప్పు ఏంటి అని నిలదీసిఫై. అందుకే మొహం ఎర్రగా కంద గెడ్డల పెట్టుకుంటే వెంటనే భజంత్రీలు భజంత్రీలు అంటారు, వెంటనే బాబు తీవ్ర ఆగ్రహం అని హెడింగ్స్ తో న్యూస్ అచ్చు అయ్యిపోతుంది.. గుడ్ నైట్..
Year by year law and order becoming worser. Jagan regime is better than TDP. Every single work GOVT employees take bribe. All lands given to poor by YCP kept hold. Free bus becoming pathetic to co passengers. No fees reimbursement. All money investing in BURADA. Local elections are proof for how worst the politics became. They can even come to your house steal all your wealth. Sympathisers still may support but not the common sense people
Tdp government vachina tharuvatha andhra lo crime rate perigindhi yevariki safety ledhu
బెంగళూరు ప్యాలెస్ మరియు లోటస్ పాండ్‌లో తప్ప, టీడీపీపై ఎటువంటి ప్రతికూలత లేదు. ఇది కఠోర వాస్తవం😁
నరేంద్ర మోడీ ఇప్పుడైనా నిజం తెలుసుకుని చంద్రబాబు గాడిని వదిలేయాలి. లేకపోతె మోడీ అండ చూసుకుని ఆంధ్ర ప్రజల్ని, పావలా పార్టీ ని, ఆఖరికి బీజేపీ ని కూడా వదలకుండా నాశనం చేస్తాడు