స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా, రెండో విడతలో పరిషత్ నామినేషన్లు పూర్తి అయ్యాయి. మిగిలిన ప్రక్రియ వేగంగా సాగుతోంది. సాధారణంగా చంద్రబాబు అధికారంలో వుంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించరు. కారణాలేంటో చంద్రబాబుకే బాగా తెలుసు.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయని అంటున్నారు. కారణాలేవైనా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం మంచిదే.
నాయకత్వం అనేదే క్షేత్రస్థాయి నుంచే మొదలవుతుంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగాలని ఆకాంక్షించే ఆశావహులు చాలా మంది వుంటారు. అలాంటి వారికి స్థానిక సంస్థల ఎన్నికలు తొలిమెట్టు.
అందువల్ల స్థానిక సంస్థల ఎన్నికలను విస్మరించడానికి వీల్లేనివి. చంద్రబాబు ఏలుబడిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతుండడం ఒక వింతగా భవిష్యత్ తరాలు చెప్పుకుంటాయి.
అయితే ఈ ఎన్నికల వల్ల కూటమి లాభనష్టాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. ప్రభుత్వంలో టీడీపీది పెద్దన్న పాత్ర. మిగిలిన రెండు పార్టీలు నామమాత్రమే.
ఈ వాస్తవం స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి రుజువైంది. అది ఎలాగంటే, నామినేషన్లు వేసేందుకు వెళ్లి దెబ్బలు తిన్న జనసేన, బీజేపీ అభ్యర్థులు, వారి అనుచరులు మీడియా సాక్షిగా వెల్లడించిన ఆవేదనే సాక్షి.
మున్సిపాల్టీలు, పరిషత్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతాయి. ఈ రెండింటికి ఇప్పటికే నామినేషన్లు పూర్తి అయ్యాయి. ఇక ఎన్నికలు జరగాల్సి వుంది. అయితే ఈ ఎన్నికల వల్ల లాభనష్టాలెవరికి అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
స్థానిక సంస్థల్ని అత్యధికంగా టీడీపీ హస్తగతం చేసుకుంటోంది. ఆ పార్టీ కోణంలో చూస్తే భారీ లబ్ధి పొందినట్టే. ఇది నాణేనికి ఒకవైపు.
ఇదే సందర్భంలో నాణేనికి రెండో వైపు కూడా చూడాల్సి వుంటుంది. లాభం అన్న తర్వాత నష్టం కూడా నీడలా వుంటుందనే సంగతి మరిచిపోవద్దు. లాభం వరకే సంబరపడితే, నష్టం ఎవరి ఖాతాలో వేయాలనే ప్రశ్న ఉదయిస్తుంది.
స్థానిక సంస్థల్లో అధికారంలో ఉన్నోళ్లు విజయం సాధించడం అనేది గొప్పకాదు. ఓడిపోతేనే వింత. సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారం చెలాయించే వారికి ఎన్నో సానుకూల అవకాశాలు దోహదం చేస్తాయి.
ప్రస్తుతానికి వస్తే, స్థానిక సంస్థల్లో సాధిస్తున్న విజయం, రేపటి టీడీపీ ఓటమికి పునాది అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇదేదో మాట వరుసకు జనం అనడం లేదు. బలమైన కారణాల్నే చెబుతున్నారు.
ఈ ఎన్నికల్లో చివరికి మిత్రపక్ష పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేసేందుకు వెళ్లగా దాడులు చేసిన టీడీపీపై జనసేన, బీజేపీ రగిలిపోతున్నాయి. మరొకటి, పొత్తు ధర్మాన్ని టీడీపీ ఏ మాత్రం పాటించడం లేదు. టీడీపీ దారుణమైన అన్యాయం చేస్తోందన్న ఆవేదన ముఖ్యంగా జనసేన నేతల్లో వుంది.
నామినేషన్లు వేయకుండా దాడులు చేశారనే ఆగ్రహం రాయలసీమ, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోని జనసేన శ్రేణుల్లో తీవ్రంగా వుంది.
ఇక పొత్తు ధర్మం ప్రకారం తగినన్ని సీట్లు ఇవ్వలేదని, తమను తీవ్రంగా అవమానించారనే ఆవేదన, ఆగ్రహం కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జనసేన సైనికుల్లో వున్నాయి.
భవిష్యత్‌లో జనసేన శ్రేణుల్లోని ఆగ్రహం, ఆవేదన వృథాగా పోవు. సార్వత్రిక ఎన్నికల్లో వాటికి టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
పవన్‌కల్యాణ్ తమ గుప్పిట్లో ఉన్నాడని, మిగిలిన వారి ఆవేదన, ఆగ్రహాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ పెద్దలు అనుకుంటూ వుండొచ్చు.
కానీ పవన్‌కల్యాణ్ అధికారంలో కొనసాగి, తమకు న్యాయం చేయకపోగా, అన్యాయం చేశారనే భావన భవిష్యత్‌లో టీడీపీకి ప్రమాద సంకేతమే. దీన్ని అంత సులువుగా కొట్టి పారేసేందుకు లేదు.
కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన చెప్పుకో విధంగా బలంగా వుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా తమకు సీట్లు ఇవ్వకపోతే జనసేన నాయకులు, కార్యకర్తలు భవిష్యత్‌లో టీడీపీ గెలుపు కోసం ఎందుకు పని చేస్తారో ఒక్కసారి ఆలోచించాలి.
ఎల్లకాలం టీడీపీ జెండా మోస్తూ, చంద్రబాబును సీఎం చేయడానికేనా తాము వున్నదని ఇప్పటికే వారు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమా అని అరాచకాలతోనూ, అలాగే పొత్తు ధర్మం పాటించలేదనే కారణంతోనూ టీడీపీకి రాజకీయంగా తీవ్ర నష్టమని చెప్పక తప్పదు.
స్థానిక సంస్థల్లో నేటి విజయాలన్నీ, భవిష్యత్‌లో ఓటమికి పునాదులనే రాజకీయ విమర్శకుల అభిప్రాయాల్ని కొట్టి పారేయడానికి వీల్లేదు.
గతంలో వైసీపీ కూడా ఇదే రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం విజయాల్ని సొంతం చేసుకున్నట్టు సంబరపడింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలేంటో అందరం చూశాం.
అధికారంలో ఉన్నప్పుడు జరిగే ఎన్నికల్ని, అలాగే వెల్లడయ్యే ఫలితాలు నిష్పాక్షికం, పారదర్శకం అని భ్రమిస్తే, అంతకు మించిన అజ్ఞానం మరొకటి వుండదు. ఈ వాస్తవాన్ని ముఖ్యంగా టీడీపీ గమనంలో పెట్టుకోవాలి.

మొత్తం టీడీపీ కీ సింగల్ digit కూడా రాదు పొత్తులో ఉంటే పవన్ కూడా గోవిందా
టీడీపీ కీ నష్టమే ఎంత అనేది తెలుస్తుంది మొత్తం గా మహిళా లు చీరలు లాగడం ఎప్పుడో భారతం లో చేసారు అని విన్నాం ఇప్పుడు చూసాము అంతే తేడా కర్మ వదిలి పెట్టదు కొట్టుక పోతారు
ఎన్నికలకి ఇంకా చాలా టైమ్ వుంది.. అభివృద్ధి అన్నది కనబడితే జనం కూటమి ని గెలిపిస్తారు..
పోలవరం, అమరావతి పూర్తి అయితే కూటమి కి చాలా ప్లస్ అవుతుంది…
వైసీపీ కి రాయలసీమ లో సీట్లు అయితే వస్తాయి కానీ అధికారం మాత్రం రాదు..
రాయలసీమ లో 70% వైసీపీ గెలిచినా మిగతా ప్రాంతాలు అన్నీ కలిపినా 30% రావడం కష్టం.. అధికారం అన్నది మాత్రం దక్కదు
కూటమి లో ఎన్ని గొడవలు వున్నా విడిపోయి పోటీ చేయడం అన్నది జరగదు..
పవన్ క్లియర్ గా వున్నాడు.. తనకి చిత్త శుద్ధి వుంది ప్రజా సమస్యలు మీద…
70% of Polavaram being completed in YCP govt….
Amaravati is being built for the sake of Kamma community
హేయ్! హెడింగ్ చూసి చెప్పొచ్చు లోపల మ్యాటర్ కూడా చదవకుండా, కూటమికి నష్టం, అన్నకి లాభం…
20@20 స్థానిక సంస్థల ఎన్నికలు బాబు కి నష్టం అన్నయ్య కి లాభం: గ్రేట్ ఆంధ్రా
ఏం జరిగినా సరే, అన్నకే లాభం. ఇంకో మాటకు తావు లేదు. అన్నే అన్నం అన్నహ. అంతే.
///గతంలో వైసీపీ కూడా ఇదే రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం విజయాల్ని సొంతం చేసుకున్నట్టు సంబరపడింది. ////
.
అయ్యొ! నిజమా? మరి అప్పుడు మీ మైండ్ ఎందుకు పనిచెయలా?
అప్పుడు సంకలు గుద్దుకున్న వారిలొ నువ్వూ ఉన్నావుగా?