కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల విశాఖకు వచ్చారు. ఉక్కు లెక్క తేలుస్తాను అంటున్నారు. విశాఖ ఉక్కుని బలిపీఠం మీద నుంచి బయట పడేస్తాను అంటున్నారు. విశాఖ ఉక్కుకి ఆమె అల్టిమేటం జారీ చేస్తున్నారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. విశాఖ ఉక్కుని కాపాడుతామని భరోసా ఇచ్చి ఇప్పుడు ఈ వైపుగా చూడరేంటని మండిపడ్డారు.
తాను విశాఖ ఉక్కు కార్మికుల కోసం అవసరం అయితే నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్షను చేస్తాను అని అన్నారు. నాలుగు వేల మందిని ఎలా తీసేస్తారు అని వారికి అండగా ఉంటామని వారిని వెంటనే విధులలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఆమె ఈ ప్రకటన చేసిన సమయానికే కార్మికులను తిరిగి తీసుకోవడానికి యాజమాన్యం సిద్ధపడింది. మరి ఈ క్రెడిట్ గత నాలుగైదు రోజులుగా పోరాడుతున్న కార్మిక సంఘాలదా లేక షర్మిలదా అన్నది చూడాల్సిందే.
విశాఖ ఉక్కు కార్మికుల కోసం అవసరం అయితే రాహుల్ గాంధీని రప్పించి విశాఖలో దీక్షకు కూర్చునేలా చేస్తామని షర్మిల చెప్పుకొచ్చారు. విశాఖకు రాహుల్ వస్తారని ఇప్పటికి చాలా కాలంగా ప్రకటనలు వస్తున్నాయి కానీ ఆయన అయితే రావడం లేదు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్ లో విలీనం చేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. మెల్లగా ఉక్కు సమస్యకు పరిష్కారం లభిస్తోందని అంతా అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ నేతలు వచ్చి అల్టిమేటం ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం అనుకున్నదే జరుగుతుంది అని అంటున్నారు.
Call boy jobs available 9989793850
ఇంట్లో వంటవాడు ఉప్పు ఎక్కువ వేసినా కాంగ్రెస్ వాళ్ళు సేవ్ డెమోక్రసీ అంటారు అనుకుంటాను!
షర్మిల సరే.. రేపు సైల్ లో విలీనం చేస్తే అన్నియ లేఖ రాయడం లేదా కార్మికులు చేసిన పోరాటం అని రాస్తావు
Addapilla, sabuubilla, kukkapilla😁😁😁😁😁😁
Cbn vadhilina baanamm
ABN రాధాకృష్ణ నుండి … నన్ను కాపాడండి అంటూ వేడుకుంటా .. జగన్ రెడ్డి .. నాకు మెసేజ్ చేశాడు : బిజెపీ నేత సుబ్రహ్మణ్య స్వామి
avunu neevu atlu ammukoleka aapa sopaalu paddatte..