పవన్ బాబా విచ్చేశారు.. నిద్ర ఆపుకోండి!

పవన్ మీటింగ్ పెడుతున్నారా.. అయితే సూక్తి ముక్తావళికి రెడీ అయిపోండి. చెవులు సిద్ధం చేసుకోండి. నిద్ర ఆపుకోండి. చప్పట్లు మాత్రం మరిచిపోవద్దు. ప్రవచనాలు ఎప్పుడు ఆగుతాయని మాత్రం అడగొద్దు. పవన్ చెబుతూ ఉంటారు, జనసైనికులు…

పవన్ మీటింగ్ పెడుతున్నారా.. అయితే సూక్తి ముక్తావళికి రెడీ అయిపోండి. చెవులు సిద్ధం చేసుకోండి. నిద్ర ఆపుకోండి. చప్పట్లు మాత్రం మరిచిపోవద్దు. ప్రవచనాలు ఎప్పుడు ఆగుతాయని మాత్రం అడగొద్దు. పవన్ చెబుతూ ఉంటారు, జనసైనికులు అలా వింటూ ఉండాలంతే. గడిచిన ఐదేళ్లుగా ఇదేతంతు. అదే రీలు. జనసైనికులకు ఈ ప్రవచనాలు అలవాటైపోయాయి.

పేరు, డబ్బు కోసం పాకులాడలేదు. మానవత్వం చచ్చిపోకూడదని తపనపడ్డాను.
ఓడిపోతాను కానీ, విలువలు వదులుకోవడానికి సిద్ధపడను.
ఓటమిలో మనతో ఉండేవాడే నిజమైన మిత్రుడు.
ఒక్క ఓటమి నన్ను కుంగదీయదు, పోరాటానికి సిద్ధం.
చప్పట్లు కొట్టించుకునే నేను తిట్లు తినడానికి రెడీ అయ్యాను.

ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ ప్రవచనాలకు అంతుఉండదు. ఈ పేజీలు, వెబ్ సైట్లు సరిపోవు. పవన్ పార్టీ పెట్టి ఐదేళ్లు అవుతుంది. ఒకసారి పరోక్షంగా, ఇంకోసారి ప్రత్యక్షంగా సార్వత్రిక ఎన్నికల్ని ఫేస్ చేశారు. అయినా పవన్ వాటి నుంచి ఏమీ నేర్చుకున్నట్టు అనిపించదు. అసలైన రాజకీయాలు, సమస్యలు వదిలేసి.. ఎప్పుడూ ప్రవచనాలు చెబుతుంటారు.

కార్యకర్తలకు (పవన్ భాషలో జనసైనికులు) ఈ ప్రవచనాలు కొత్తకాదు. పార్టీ పెట్టిన మొదటిరోజు నుంచి ఈ సూక్తి ముక్తావళి వింటూనే ఉన్నారు. అసలైన కార్యాచరణ, రాజకీయ పోరాటం అంటే ఏంటో వాళ్లు పవన్ ప్రవచనాల్లో వినడమే తప్ప రోడ్డుపైకొచ్చి పోరాటం చేసిందిలేదు. బురదజల్లడం ఇష్టంలేదు, బూతులు మాట్లాడ్డం ఇష్టంలేదని చెప్పే పవన్ పోరాటం చేయడానికి కూడా ఇష్టం చూపిస్తున్నట్టులేదు.

ఈరోజు నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ జనసేన కార్యకర్తలతో మాట్లాడారు పవన్. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దశలవారీగా కార్యకర్తల్ని కలుస్తున్న పవన్, ఇకనైనా రాజకీయంగా వ్యవహరిస్తారని అంతా ఎదురుచూశారు. కానీ పవన్ అందరి ఆశల్ని నీరుగార్చారు. మైక్ పట్టుకోగానే మరోసారి బాబా అవతారం ఎత్తారు. రీలు రిపీట్ చేశారు.

మైక్ పుచ్చుకొని అర్థగంట పాటు అనర్గలంగా ప్రసంగించిన పవన్, రాజకీయంగా పనికొచ్చే స్టేట్ మెంట్ ఒక్కటి ఇవ్వలేదు. నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా కీలక సమస్యను ప్రస్తావించినా సరిపోయేది. కనీసం ఆ పని కూడా చేయలేదు జనసేనాని. పైపెచ్చు తనను అర్థం చేసుకునే నాయకులు తక్కువైపోవడం వల్ల పోరాటం చేయలేకపోతున్నానని, అదే తనకు పెద్ద ఇబ్బందిగా మారిందని ప్రకటించారు.

నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఏదైనా ఒక సమస్యను హైలెట్ చేస్తూ పవన్ ప్రజాక్షేత్రంలోకి రావాలి. కార్యకర్తల్ని కలుపుకొని ధర్నా చేయాలి. కానీ గడిచిన ఐదేళ్లలో అలాంటి పని ఒక్కటి కూడా చేయలేదు. ప్రవచనాలు, విలువలు, పర్సనాలిటీ డవలప్ మెంట్ క్లాసులతోనే కాలం గడిపేశారు.

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!