Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆకుల సత్యనారాయణ.. సతీసమేతంగా!

ఆకుల సత్యనారాయణ.. సతీసమేతంగా!

దసరా రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చేరికలకు జగన్ పెద్దగా ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఎవరైనా వచ్చే వారుంటే రావొచ్చు అన్నట్టుగానే ఉంది కథ. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్న వారు వాటిని వదిలి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చేరికలు మందకొడిగానే  ఉన్నాయి.

ఇక ఇటీవలే జనసేనకు రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉండిన ఆకుల ఎన్నికల ముందు జనసేనలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిన ఆయన కొన్నాళ్లుగా ఆ పార్టీకి దూరంగా మెలుగుతున్నారు. ఇటీవలే అధికారికంగా రాజీనామా చేశారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతున్నారు.

విశేషం ఏమిటంటే.. ఆకుల సతీసమేతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారట. ప్రత్యేకంగా సతీసమేతంగా అని ఎందుకు చెబుతున్నారంటే, ఇది వరకూ ఆకుల బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన భార్య జనసేనలో చేరారు. భర్త బీజేపీ ఎమ్మెల్యేగా, భార్య జనసేన నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల నాటికి ఆకుల జనసేనలోకి చేరారు. ఇప్పుడు మాత్రం ఈ భార్యాభర్తలు ఇద్దరూ జాయింటుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారట. భార్య,భర్త చెరో పార్టీలో కాకుండా.. ఒకే పార్టీలో ఉండబోతున్నారట!

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?