వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కెమెరాను ఫేస్ చేస్తున్నారు. ఆయన నేపధ్యం వేరు. కానీ ఆయన ఫస్ట్ టైన్ కెమెరాను టచ్ చేస్తున్నారు. అది అనివార్యమైన పరిస్థితిలోనే ఆయన సినిమాను వేదికగా చేసుకోబోతున్నారు. ఇదిలా ఉంటే ఎవరా ఎమ్మెల్యే అన్న డౌట్ రావచ్చు. ఆయన విశాఖ జిల్లాకు చెందిన అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు బ్యాక్ ఉద్యోగిగా, ఉపాధ్యాయుడిగా చేశారు.
అంతే కాదు, ఆయన సేవా కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున చేస్తూ వచ్చారు. ఆయన సేవాభావాన్ని మెచ్చి జగన్ ఆయనకు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎందరు పోటీగా వచ్చినా కూడా ఎదురులేని తీరున ఫల్గుణ మంచి మెజారిటీతో గెలిచి అధినాయకత్వం మన్ననలు అందుకున్నారు.
ఇక లేటెస్ట్ గా ఆయన అమ్మఒడి అనే సినిమాలో నటిస్తున్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి పధకాన్ని అమలు చేస్తోంది. ఈ పధకం వల్ల ఎంతో మంది పేదలు లబ్ది పొందుతున్నారు. ఈ పధకం గురించి మరింతగా ప్రాచుర్యం లోకి తెచ్చేందుకు ఏకంగా అమ్మఒడి పేరునే పెట్టి మరీ టాలీవుడ్ లో మేకర్స్ సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖ ఏజెన్సీలోని పాడేరు పరిసరాలలో జరుగుతోంది.
ఇందులో అమ్మఒడి గురించి ప్రజలకు, తల్లిదండ్రులకు వివరించే ఉదాత్త ఉపాధ్యాయుడి పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ నటిస్తున్నారు. పాడేరులోని దిగుమోదాపుట్టు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం అమ్మఒడి సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఇలాంటి సినిమా తీయాలని ఆలోచన వచ్చిన మేకర్స్ ని ఎమ్మెల్యే ఫల్గుణ అభినందించారు. ఇక ఎమ్మెల్యే చక్కని పాత్ర నటించడం పట్ల మేకర్స్ తో పాటు వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సో కొత్త ఏడాది అమ్మఒడి జనం ముందుకు రాబోతోంది.