సూర్య నటించిన కంగువ కోసం చాలామంది వెయిటింగ్. ఎందుకంటే, ఈ సినిమా జానర్ అలాంటిదే. ఫస్ట్ లుక్, గ్లింప్స్ క్రియేట్ చేసిన బజ్ అటువంటిది. అయితే ఇప్పుడీ సినిమా విడుదలకు ముందే, సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.
అవును.. కంగువ సినిమాకు పార్ట్-2 కూడా రాబోతోంది. కంగువ క్లయిమాక్స్ లో సీక్వెల్ కోసం అద్భుతమైన లీడ్ ఇచ్చారట. ఈ విషయాల్ని నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రకటించారు.
“ప్రొడక్షన్ కు ముందే పార్ట్-1, పార్ట్-2 అనుకున్నాం. కథలు కూడా రెడీగా ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి పార్ట్-1 మాత్రమే పూర్తయింది. పార్ట్-2 షూటింగ్ ను 2025 చివర్లో లేదా 2026 ప్రారంభంలో పూర్తిచేస్తాం. 2027 జనవరి లేదా వేసవికి కంగువ-2 రిలీజ్ అవుతుంది.”
కంగువ సినిమా షూటింగ్ కు 185 రోజులు టైమ్ పట్టిందని, పార్ట్-2 షూటింగ్ కు అంతకుమించి టైమ్ పడుతుందని అంటున్నారు మేకర్స్. అందుకే ఎక్కువ టైమ్ తీసుకుంటున్నామని, మరో మూడేళ్ల తర్వాతే పార్ట్-2 వస్తుందని క్లారిటీ ఇచ్చాడు.
16వ శతాబ్దంలో జీవించిన ఓ యోధుడి కథే కంగువ. అరుదైన వ్యాధితో అతడు మరణిస్తాడు. ఆ యోధుడు, అతడి వ్యాధికి సంబంధించి ఇప్పటితరంలో హీరోయిన్ రీసెర్చ్ చేస్తుంది. సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటించగా, ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటించాడు.
కంగువ సినిమాను ఒకేసారి 5 భాషల్లో అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. ఐమ్యాక్స్, త్రీడీ ఫార్మాట్స్ లో కూడా ఈ సినిమా వస్తోంది.