ఇకపై ఆ 16 కీటకాలు తినొచ్చు

మనం అన్నం తింటాం, ఉత్తరాదిన రోటీలు తింటారు. యూరోపియన్ దేశాలు, అమెరికాలో బ్రెడ్ తింటారు. ఇవి కాకుండా చైనీయులు, జపనీయులు, కొరియన్లు కొన్ని రకాల కీటకాల్ని తింటారు. ఇలా రొటీన్ గా ఒకే రకమైన…

మనం అన్నం తింటాం, ఉత్తరాదిన రోటీలు తింటారు. యూరోపియన్ దేశాలు, అమెరికాలో బ్రెడ్ తింటారు. ఇవి కాకుండా చైనీయులు, జపనీయులు, కొరియన్లు కొన్ని రకాల కీటకాల్ని తింటారు. ఇలా రొటీన్ గా ఒకే రకమైన కీటకాల్ని తినడం వాళ్లకు బోర్ కొట్టింది.

అందుకే ఇప్పుడు తమ మెనూలోకి కొత్త కీటకాల్ని చేర్చారు. తాజాగా సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ 16 రకాల కీటకాలను తినొచ్చంటూ ఆమోదం తెలిపింది. వీటిలో మిడతలు, బొద్దింకలు, వానపాముల జాతులకు చెందిన కీటకాలున్నాయి. వీటితో పాటు యూరోప్ దేశాలకు చెందిన కొన్ని రకాల తేనెటీగల్ని కూడా మెనూలో చేర్చింది.

అయితే వీటికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫుడ్ అథారిటీ చెప్పిన ప్రమాణాలను అనుసరించి వీటిని పెంచాలని, అలాంటి కీటకాల్ని మాత్రమే వంటకాల్లో ఉపయోగించాలని చెప్పింది.

సింగపూర్ చేసిన ఈ ప్రకటన చైనా, థాయ్ లాండ్, వియత్నాం దేశ రైతులకు ఆనందాన్ని కలిగించింది. కొన్నేళ్లుగా ఈ జాతుల పురుగుల్ని పెంచుతున్న ఈ దేశాల రైతులకు, ఇప్పుడు సింగపూర్ మార్కెట్ ఓపెన్ అయింది.