Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్యను కలిసిన కృష్ణవంశీ

బాలయ్యను కలిసిన కృష్ణవంశీ

బాలయ్య వందో సినిమా ఓపెన్ ఆఫర్ మాదిరిగా వుండిపోయింది. బోయపాటి సంగతి తేలలేదు..సింగీతం తో చేయడం రిస్కేమో అని బాలయ్య సన్నిహితులు పదేపదే చెబుతున్నారు. క్రిష్ ఓ లైన్ చెప్పాడని వినవచ్చింది. తాజగా కృష్ణవంశీ కూడా ఓ సోషియో ఫాంటసీ లైన్ చెప్పాడని తెలుస్తోంది. 

రెండు రోజుల క్రితం కృష్ణ వంశీ వచ్చి బాలయ్య బాబును కలిసి వెళ్లాడన్నది కన్ ఫర్మ్ వార్తగా వినిపిస్తోంది.  ఈ సందర్భంగా ఓ సోషియో ఫాంటసీ లైన్ వినిపించాడని టాక్. అదిమాత్రం ఎంతవరకు నిజమో తెలియాలి.  

గతంలో నితిన్ తో శ్రీఆంజనేయం లాంటి సోషియో ఫాంటసీని కృష్ణవంశీ డీల్ చేసాడు. ఇప్పుడు ఆల్రెడీ రుద్రాక్ష అనే సినిమాపై కసరత్తు చేస్తున్నాడు. మరి బాలయ్యతో ఏం చేద్దామనుకుంటున్నాడో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?