Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్..ఇప్పుడు మేల్కొన్నాడు

ప్రభాస్..ఇప్పుడు మేల్కొన్నాడు

సినిమాల్లోనే కాదు..సినిమా రంగంలోనూ రాజకీయాలుంటాయి. సినిమాకే కాదు..సినిమా నటులకూ స్ట్రాటజీలు కావాలి. సినిమారంగం లాగే సినిమా కూడా చిత్రమైంది. పెద్ద నిర్మాత సినిమా తీస్తే బ్యానర్ కు పేరొస్తుంది. పెద్ద దర్శకుడు సినిమా రూపొందిస్తే ఆయనకు కీర్తి వస్తుంది..పెద్ద హీరో సినిమా చేస్తే అతగాడికి చరిష్మా పెరుగుతుంది. మరి మల్టీస్టారర్లు చేస్తే..ఎవడి స్ట్రాటజీ వాడిది. దాన్ని బట్టే ఎవరి ఖాతాలోకి ఆ సినిమా విజయం వెళ్తుందీ అన్నది డిసైడ్ అవుతుంది. అయితే బాలీవుడ్ సంగతి అలా వుంచితే తెలుగు సినిమా రంగంలో పోటీ, రాజకీయం రెండూ ఎక్కువే. అభిమానుల సందోహం అంతకన్నా ఎక్కువే. అందుకే ఎవడి ప్లానింగ్ వాడికి వుండాలి. లేదంటే, మొత్తం క్రెడిట్ మూడగట్టుకుని మరెవరో తీసుకుపోతారు. అందుకే గబ్బర్ సింగ్ చెప్పినట్లు..ఎవడి డప్పు వాడు వాయించుకోవాల్సిందే. అందులో మొహమాటపడడానికి ఏమీ లేదు.

బాహుబలి సినిమా ఇప్పుడు ఓ చరిత్ర సృష్టించిన వైనం. అందులో హీరో ప్రభాస్. అందులో వివాదానికి తావులేదు. ప్రభాస్ యాభై కోట్ల హీరో. ఆ సంగతి మిర్చి చెప్పకనే చెప్పింది. మరి రానా? బాహుబలి వరకు రానాకు ఒక్క హిట్ లేదు. అన్నీ ఫ్లాపులే. అయితే రానా నేపథ్యం చిన్నది కాదు. సినిమా రంగాన్ని శాసించే కీలక వ్యక్తి అయిన సురేష్ బాబు ఆయన తండ్రి.

అందుకే బాహుబలి విడుదల నాటి నుంచీ రానాకు ప్రభాస్ తో సమస్థానం దక్కుతూ వచ్చింది. అయితే కథాపరంగా అంతటి ప్రాధాన్యత వున్న పాత్ర కాబట్టి అని అనేసుకోవడం సులువే. నిజానికి రాజమౌళి సినిమాల్లో విలన్ కు ఎప్పుడూ అగ్రతాంబూలం వుంటూనే వుంటుంది. మరి ఆ సినిమాలన్నింటికీ విలన్ కు భారీ కట్ అవుట్ లు ఎప్పుడూ కనిపించలేదేం? ఈగ సుదీప్ కు భారీ కటౌట్లు పెట్టరా? లేదే? పోనీ ఈ సినిమాకు ప్రభాస్, రానా ఇద్దరూ హీరోలే అనుకుందాం. కానీ సినిమా మేకింగ్ నుంచీ ఏ ప్రచార కార్యక్రమంలో చూసినా రానానే.

బెంగుళూరు, ముంబాయి, హైదరాబాద్ ల్లో ఎక్కడ ఏ కార్పొరేట్ కార్యక్రమం జరిగినా, దాంట్లో బాహుబలికి చోటు వున్నా, వేదికపై రానానే. ఆఖరికి పైరసీ మీద కార్యక్రమం పెట్టినా రానానే. పైగా రానా మీడియా ఫ్రెండ్లీగా వున్నాడు. బాలవుడ్ లో ఆయన లైజనింగ్ నే వేరు. ఇక్కడ కూడా అడగడని వాడిది పాపం. ఇంటర్వూలే ఇంటర్వూలు. ప్రభాస్ వైనం అలా కాదు. గట్టిగా పది మందితో మాట్లాడేసరికి పుణ్యకాలం పూర్తయిపోయింది. అంతెందుకు తిరుపతిలో అడియో ఫంక్షన్ జరుగుతుంటే దారి పొడవునా రానా ప్లెక్సీలే ఎక్కువ. అప్పుడే అభిమానులు కాస్త కిందా మీదా అయ్యారు. 

ప్రభాస్ కు షూటింగ్..ఫ్రెండ్స్ తో సరదాలు తప్ప మరేవీ పట్టవు..పట్టించుకోలేదు. కానీ అప్పటికే జరగాల్సిన డామేజీ జరిగిపోయింది. ఆంధ్రలో ప్రభాస్ హీరో కావచ్చు..ఆయనపై రకరకాల కారణాలతో అభిమానం పెంచుకున్నవారు ఓకె. కానీ బాహుబలి నేషనల్, ఇంటర్నేషనల్ సినిమా అయి కూర్చుంది. మరి అక్కడ మాటేమిటి? ఓ జాతీయ పత్రిక ఇలా రాసింది '...రానా మినహా మరే పెద్ద స్టార్ లేకున్నా బాహుబలి అద్భుతమైన విజయం సాధించింది...' ఇది తెలుగుజనాలు చదివితే ఏమనుకుంటారు..అరె రానా పెద్ద స్టార్ నా..మరి ప్రభాస్ మాటేమిటి? దీనికి తప్పు రానాది కాదు..ప్రభాస్ దే. 

బాహుబలి సినిమాకు పీఆర్ వింగ్ అంతా రాజమౌళి కనుసన్నలలోనే జరిగింది. అసలు పీఆర్వోని పోస్ట్ మాన్ కింద చేసేసారు తప్ప మరేమీ కాదు. రాజమౌళి ఆపీసు జనాలనే పీఆర్వోగా వాడారు. ప్రభాస్ పీఆర్వో ఈ సినిమాకు పీఆర్వో. ఆయనను తెలివిగా పక్కన పెట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ది కూడా అంతా టేకిటీజీ పాలసీ. అందుకే పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ అంతా చూసుకునే సరికి జరగాల్సిన డామేజీ జరిగిపోయింది. ఇప్పుడు బాహుబలి విజయం ఆంధ్రలో రాజమౌళికి, బాలీవుడ్ లో రానాకు వెళ్లిపోయింది. నిజానికి ఓవర్ సీస్ లో, కర్ణాటకలో, ఈస్ట్ వెస్ట్ ల్లో, విజయం సాధించడం వెనుక ప్రభాస్ అభిమానుల కృషి చాలా వుంది, కానీ అదంతా మరుగున పడిపోయింది. 

రెండు రోజుల క్రితం ప్రభాస్ నిద్రలేచాడు. ఓవర్ సీస్ లో బాహుబలి విజయం మీద ఓ నోట్ విడుదల చేసారు. దాంట్లో ప్రభాస్ పేరు లేనే లేదు. అప్పుడు..అదిగో, సరిగ్గా అప్పుడు బాహుబలికి కోపం వచ్చిందని వినికిడి. ఆయన నిర్మాతలకు ఫోన్ చేసి, '...సరే చేసుకోండి..పార్ట్ 2 ఎలా చేసుకుంటారో,..' అనే టైపులో వేసుకున్నారని తెలుస్తోంది. దాంతో గడబడి..ఫోన్ లు, ఈ మెయిళ్లు..వెంటనే ప్రెస్ నోట్ సవరణ. అప్పుడు అసలు విషయం తెలిసి వచ్చింది. వెంటనే ప్రభాస్ తనంతట తాను, సుదర్శన్ థియేటర్ కు వెళ్లి అభిమానులను నేరుగా కలుసుకున్నాడు. ఇది ఆయన ఓన్ గా ఏర్పాటుచేసుకున్న కార్యక్రమం. తెలుగు మీడియాను బాహుబలికి దూరంగా , మబ్బుల్లోనే వుంచిన వైనం తెలిసింది. అందుకే ఈరోజు (మంగళవారం) ప్రభాస్ నేరుగా మీడియా మొత్తంతో ఇంట్రాక్ట్ అవుతున్నాడు. 

నిజానికి ఇప్పుడు బాహుబలి కారణంగా మరొ ఏడాది  రెగ్యులర్ సినిమాలకు దూరంగా వుండాలి ప్రభాస్. పైగా పార్ట్ 2 వల్ల కూడా తనకు పేరు రానిస్తారా అన్నది అనుమానమే. రికార్డులు, లెక్కలు ప్రభాస్ కు వుంటే వుండొచ్చు,. కానీ క్రెడిట్ అంతా రాజమౌళికే. అందువల్ల తన ప్రచారం ప్రభాస్ తను చూసుకోవాలి. లేదంటే రాజకీయాల టాలీవుడ్ లో మరో హరనాధ్, నరసింహరాజును చేసేస్తారనే సూచనలు వినిపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ హరనాథ్, నరసింహరాజుల రేంజ్ వేరు, ప్రభాస్ రేంజ్ వేరు. పైగా వారు కిందపడిన కారణాలు వేరు. కానీ వాళ్లు కూడా ఆ రోజుల్లో ఓ రేంజ్ కు చేరిన వారే.  అయినా ప్రభాస్ ఎంతయినా బాహుబలి..అమ్మాయిల డార్లింగ్..అభిమానులు మిస్టర్ పర్ ఫెక్ట్. కానీ ఎటొచ్చీ, ప్రెండ్స్ సరదాలే కాదు..తన పీఆర్ వ్యవహారాలు తాను చూసుకోవాలి కదా..

పిఎస్..ఇదంతా ఏదో రానాకు పేరు వచ్చేస్తోందనో, ప్రభాస్ కు రాలేదనో కాదు, పక్కాగా కోస్తా జిల్లాల్లోని ప్రభాస్ అభిమానుల ఆవేదనలోంచి వచ్చిన విషయమే. వాళ్లు పైకి ఏమీ అనడం లేదు ఎలాగూ పెద్ద హిట్ అయింది కాబట్టి. నిజానికి డివైడ్ టాక్ వచ్చిన నాడు ఉదయం..అంటే విడుదల నాడు ఉదయం వెస్ట్ గోదావరిలో ప్రభాస్ ఫ్యాన్స్ ముందు చాలా బాధపడ్డారు. తరువాత సినిమా నిల్చున్నాక కామ్ అయ్యారు.  బాహుబలి సినిమాపై..పెద్ద వాళ్ల ట్వీట్ లు అన్నీ ప్రభాస్ ప్రస్తావన ఎక్కడన్నా వుందా? ఆఫ్ కోర్స్ బాహుబలి అన్నది రాజమౌళి కలలకు రూపం కావచ్చు. కానీ హీరో ఆధారిత సినిమా రంగమే కదా మనది. ప్రభాస్ లేకుంటే బాహుబలికి పూర్ణరూపం వచ్చేదా అన్నది అభిమానులు ఆర్గ్యుమెంట్.

ఆర్వీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?