అన్నపూర్ణలో లయన్ ఫైట్

బాలకృష్ణ జూలు విదిలించాడు..ఆయనకు రామ్ లక్ష్మణ్ తోడయ్యారు. దాంతో అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ పైట్ తో దద్దరిల్లింది. లయన్ సినిమా హీరో ఇంట్రడక్షన్, ఇంకా కొన్ని ఫైట్ల ప్యాచ్ వర్కను అన్నపూర్ణలో చురుగ్గా పూర్తి…

బాలకృష్ణ జూలు విదిలించాడు..ఆయనకు రామ్ లక్ష్మణ్ తోడయ్యారు. దాంతో అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ పైట్ తో దద్దరిల్లింది. లయన్ సినిమా హీరో ఇంట్రడక్షన్, ఇంకా కొన్ని ఫైట్ల ప్యాచ్ వర్కను అన్నపూర్ణలో చురుగ్గా పూర్తి చేసారు. 

రేపు లేదా ఎల్లుండి ప్రకాష్ రాజ్, బాలయ్య మధ్య మరో ఫైట్ ను జెఆర్ సి కన్వెన్షన్ హాల్ లో ప్లాన్ చేసారు. వీటితో దాదాపు లయన్ టాకీ పార్ట్ పూర్తయిపోతుంది. రమణారావు నిర్మించే సినిమాకు సత్యదేవ్ దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వీలయినంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలని చురుగ్గా నిర్మాణం కానిస్తున్నారు.