కొత్త డైరక్టర్ సినిమాకు పాత డైరక్టర్ సాయం

ఆల్రెడీ ఓ సినిమా డైరక్ట్ చేసారంటే, మళ్లీ మరి వెనక్కు వెళ్లరు చాలా మంది. ఇంకో సినిమా డైరక్ట్ చేయాలనే అనుకుంటారు. కానీ చిత్రంగా సాయిరాజేష్ అనే డైరక్టర్ ఓ సినిమాకు స్క్రిప్టు మాటలు…

ఆల్రెడీ ఓ సినిమా డైరక్ట్ చేసారంటే, మళ్లీ మరి వెనక్కు వెళ్లరు చాలా మంది. ఇంకో సినిమా డైరక్ట్ చేయాలనే అనుకుంటారు. కానీ చిత్రంగా సాయిరాజేష్ అనే డైరక్టర్ ఓ సినిమాకు స్క్రిప్టు మాటలు అందిస్తున్నారు. కానీ సినిమాకు డైరక్షన్ తొలిసారి చేస్తున్నాడు ఈటీవీతో పాపులర్ అయిన ప్రభాకర్. 

బన్నీవాసు, అల్లు అరవింద్ నిర్మించే ఈ సినిమా కు స్టార్ కాస్ట్ ఇంకా డిసైడ్ కాలేదు. త్వరలో ప్రారంభమవుతుంది. ఇదిలా వుంటే ఇదే బ్యానర్ లో మరో సినిమాకు స్క్రిప్ట్ తో పాటు డైరక్షన్ కూడా చేయబోతున్నాడు సాయి రాజేష్. ఇంతకీ సాయిరాజేష్ ఎవరో తెలుసుగా..సంపూర్ణేష్ బాబును ఓవర్ నైట్ స్టార్ ను చేసేసిన హృదయ కాలేయం డైరక్టర్.