నాగశౌర్య…యూ..టూ..మాస్ రూటు?

క్యూట్ గా లవర్ బాయ్ లా వుంటాడు..నాగశౌర్య. ఇంకా ఇప్పుడే స్కూల్ డేస్ కంప్లీట్ చేసుకునవాడిలా..కానీ ఏం చేస్తాం..తెలుగు సినిమా అంటే మాస్ మ్యాజిక్. అందుకే అతగాడు కూడా మాస్ రూటు పట్టేసాడు. జాదూగాడు…

క్యూట్ గా లవర్ బాయ్ లా వుంటాడు..నాగశౌర్య. ఇంకా ఇప్పుడే స్కూల్ డేస్ కంప్లీట్ చేసుకునవాడిలా..కానీ ఏం చేస్తాం..తెలుగు సినిమా అంటే మాస్ మ్యాజిక్. అందుకే అతగాడు కూడా మాస్ రూటు పట్టేసాడు. జాదూగాడు నేనే..అంటూ రఫ్ లుక్ చూపించేసాడు.

కాస్త పెరిగిన గెడ్డం, చేతిలో డబుల్ బారెల్ గన్, రేబాన్ గ్లాసెస్ తో చిత్రంగా వున్నాడు నాగశౌర్య. సరైన సినిమా కోసం, అంతకు మించి హిట కోసం చూస్తున్నాడు. అందుకే లవర్ బాయ్ ఇమేజ్ ను, లోపల దాచి కొత్తగా వుంటుందని ట్రయ్ చేస్తున్నట్లున్నాడు. చాన్నాళ్ల క్రితం వెంకీ, అనుష్కలతో చింతకాయల రవి సినిమా తీసిన యోగేష్ ఈ సినిమాకు దర్శకుడు.