టాలీవుడ్ ను మళ్లీ కథల కొరత పట్టిపీడిస్తోంది. రీమేక్ సినిమాలు క్లిక్ అవుతుండడంతో మళ్లీ హీరోల దృష్టి అటు పడింది. ఎక్కడ తమ ఏజ్ కు, ఫిజిక్ కు సరిపోయే సినిమాలు ఏ భాషలో వున్నా వెదికి పట్టుకుంటున్నారు. అందునా ఏజ్ బారైపోతున్న హీరోలు మరీ పర్టిక్యులర్ గా వున్నారు.
ఈ విషయంలో వెంకీ అందరికన్నా ముందుండి, ఎక్కడెక్కడి సినిమాలను వెతికి పట్టుకుంటున్నారు. ఇలాగే ఇప్పటికి మూడు సినిమాలు చేసి, రెండు హిట్ లు కొట్టారు. ఏడాది కిందట తమిళంలో వచ్చిన మల్లీ స్టారర్ జిల్లా. ఇప్పుడు ఈ సినిమా మీద వెంకీ దృష్టి వుంది. పైగా ఇది సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్ బి చౌదరి నిర్మించింది కాబట్టి, సురేష్ వారికి హక్కులకు పెద్దగా సమస్య వుండదు.
కానీ ఇప్పుడు ఇదే సినిమాను..బాబాయ్ తో తాను కలిసి చేస్తే ఎలా వుంటుదని ఆలోచిస్తున్నాడట కళ్యాణ్ రామ్. విజయ్ పాత్రను తాను,మోహన్ లాల్ పాత్రను బాబాయ్ చేయాలన్నది కళ్యాణ్ రామ్ సంకల్పం. కానీ ఇది అంత సులువుగా నెరవేరక పోవచ్చు. ఎందుకంటే ఒకటి సురేష్ వారిని కాదని హక్కులు తెచ్చుకోవడం, రెండు బాబాయ్ బాలకృష్ణను ఒప్పించడం. రెండూ కాస్త కష్టమే.