మ‌రీ ఇంత సాహ‌స‌మా పూరీ…

పూరి జ‌గ‌న్నాథ్‌కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ‌. త‌న సినిమాల్లోని హీరోలానే.. ఇప్పుడు అదే ధైర్యంతో మ‌రో సాహ‌సం చేయ‌బోతున్నాడ‌ట‌. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్‌. టెంప‌ర్‌లో…

పూరి జ‌గ‌న్నాథ్‌కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ‌. త‌న సినిమాల్లోని హీరోలానే.. ఇప్పుడు అదే ధైర్యంతో మ‌రో సాహ‌సం చేయ‌బోతున్నాడ‌ట‌. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్‌. టెంప‌ర్‌లో నారాయ‌ణ మూర్తి కోసం ఓ పాత్ర రాసుకొన్నాడు పూరి. కానీ ఇలాంటి చిన్నా చిత‌కా పాత్రలు చేయ‌న‌ని మూర్తి.. ఖ‌రాఖండీగా చెప్పేశాడు.

 ''నాకోసం ఓ సినిమా తీయ్‌.. అప్పుడు యాక్ట్ చేస్తా బ్రద‌ర్‌..'' అన్నాడ‌ట మూర్తి. దాన్ని పూరి సీరియ‌స్‌గా తీసుకొని ఆర్‌.నారాయ‌ణ‌మూర్తితో ఓ అభ్యుద‌య భావాలున్న సినిమా తీయ‌బోతున్నాడ‌ని టాక్‌. జ్యోతిల‌క్ష్మి ముగిసిన వెంట‌నే పూరి ఈ ప్రాజెక్టును మొద‌లెడ‌తాడ‌ట‌. 

కేవ‌లం నెల‌రోజుల్లో సినిమా తీయ‌డానికి పూరి ప్లానింగులు వేస్తున్నాడు. పూరి – నారాయ‌ణ మూర్తి సినిమా అంటే.. భ‌లే క్రేజ్‌. మ‌రి పూరి ఈ ప్రాజెక్టుని మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం చేస్తాడో, చేత‌ల్లోనూ తీసి చూపిస్తాడో అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.