ఆలు లేదు..చూలు లేదు..

దాసరి..పవన్ సినిమా వ్యవహారం అచ్చంగా ఇలాగే వుంది. ఆ సినిమాకు కొబ్బరి కాయ కొట్టే వరకు నమ్మకం లేదు. పవన్ వైపు నుంచి ఈ విషయమై స్పందన లేదు. కానీ దాసరి అభిమానులు మాత్రం…

దాసరి..పవన్ సినిమా వ్యవహారం అచ్చంగా ఇలాగే వుంది. ఆ సినిమాకు కొబ్బరి కాయ కొట్టే వరకు నమ్మకం లేదు. పవన్ వైపు నుంచి ఈ విషయమై స్పందన లేదు. కానీ దాసరి అభిమానులు మాత్రం ఫీలర్లపై ఫీలర్లు వదులుతున్నారు. 

ఇదేదో ఎమోషనల్ యవ్వారం లా తయారైంది. దాసరి దగ్గర వున్న పరభాషా సినిమా రీమేక్ చేస్తారని..కాదు..కాదు..అసలు పవన్ డైరక్ట్ చేస్తాడని…ఇలా రకరకాల వార్తలు. వీటన్నింటికి మించిన వార్త..అసలు కథ లేదు..డైరక్టర్ లేడు..కానీ విలన్ గా మోహన్ బాబు అంటూ మరో వార్త. 

చూస్తూ వుంటే దాసరి అభిమానులే కథను, యూనిట్ ను గ్యాసిప్ ల్లోనే సెట్ చేసి, పవన్ చేత షూటింగ్ కూడా చేయించేసాలా వున్నారు.