ఫ్లాప్‌ స్ట్రీక్‌కి బ్రేక్‌ పడనట్టే!

మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌ ఈమధ్య తన ట్యాగ్‌కి న్యాయం చేయలేకపోతున్నాడు. కొంతకాలంగా ఫ్లాప్స్‌ చవిచూస్తున్న నరేష్‌కి కొత్త సినిమా ‘బందిపోటు’ కూడా చేదు ఫలితాన్నే ఇచ్చే దిశగా సాగుతోంది.…

మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్‌ ఈమధ్య తన ట్యాగ్‌కి న్యాయం చేయలేకపోతున్నాడు. కొంతకాలంగా ఫ్లాప్స్‌ చవిచూస్తున్న నరేష్‌కి కొత్త సినిమా ‘బందిపోటు’ కూడా చేదు ఫలితాన్నే ఇచ్చే దిశగా సాగుతోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించిన నరేష్‌ ఈసారి కూడా ఫెయిలైనట్టేనని కలెక్షన్స్‌ ట్రెండ్‌ చెప్తోంది. 

మిక్స్‌డ్‌ రివ్యూస్‌ తెచ్చుకున్న బందిపోటు సగటు అల్లరి నరేష్‌ కామెడీ చిత్రాలకి భిన్నంగా తెరకెక్కింది. మాస్‌ కామెడీలతో ఎక్కువ విజయాలు సాధించిన నరేష్‌ ఈసారి క్లాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు కానీ అది రివర్స్‌ అయింది. అటు తన స్టాండర్డ్‌ ఆడియన్స్‌ని మెప్పించలేక… ఇటు కొత్తగా మరో సెక్షన్‌ని థియేటర్స్‌కి రాబట్టలేక ‘బందిపోటు’గా నరేష్‌ స్ట్రగుల్‌ అవుతున్నాడు. 

అసలే వీక్‌గా ఉన్న ఈ చిత్రానికి ఫస్ట్‌ సండే కాస్తా ఇండియా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ రూపంలో మరింత పెద్ద షాక్‌ ఇచ్చింది. గత రెండేళ్లలో ఇబ్బందులు పడ్డ నరేష్‌ ఈ ఏడాదిలో అయినా టైమ్‌ మారుతుందని ఆశించాడు కానీ అతను కోరుకున్న స్టార్ట్‌ అయితే దక్కలేదు. తన ఫ్లాప్‌ స్ట్రీక్‌కి బ్రేక్‌ వేయడం బందిపోటు వల్ల అయ్యేట్టు లేదు కనుక ఇంకో సినిమా రావాల్సిందే.