సెలబ్రిటీలు దాన ధర్మాలు బాగానే చేస్తుంటారు. అయితే వీటిని కొందరు పబ్లిసైజ్ చేసుకుంటారు. కొందరేమో గుప్త దానాలు చేస్తారు. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదనేది కొందరి అభిప్రాయమైతే… మనం చేసిన సాయం గురించి చెప్తే పది మందికి స్ఫూర్తినిచ్చిన వారమవుతామనేది మరికొందరి ఫీలింగ్. రెండూ కరెక్టే.
అయితే ఇందులో మొదటి రకానికి చెందుతాడు మహేష్‌బాబు. తను చేసే చారిటీల గురించి మహేష్‌బాబు అస్సలు చెప్పుకోడు. ఎవరో సన్నిహితులకి మినహా మహేష్ చేసే దాన ధర్మాల గురించి ఎవరికీ తెలీదు. మహేష్‌లోని ఈ యాంగిల్‌ని కమెడియన్ అలీ ఓ సందర్భంలో బయట పెట్టాడు.
‘ఇన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు కదా. ఇంకా అన్ని యాడ్స్ ఎందుకు చేస్తున్నార’ని మహేష్‌ని అలీ అడిగాడట. చారిటీలకి, ఓల్డేజ్ హోమ్స్‌కి నమ్రత డొనేషన్స్ ఇస్తుంటుందని, తన సంపాదనలో ముప్పయ్ శాతం చారిటీలకే ఖర్చు పెడుతుంటానని మహేష్‌బాబు చెప్పాడట. ఇన్ని దానాలు చేస్తున్నా కానీ దాని గురించి అస్సలు మాట్లాడని మహేష్ గొప్పతనాన్ని ఎంత కొనియాడినా తక్కువే.