ఈమధ్య ఆడియో ఫంక్షన్ అంటే.. ఏవీల గోల కంపల్సరీ అయిపోయింది. నిర్మాత, హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరోయిన్… ఇలా అందరి గొప్పదనాన్ని చాటుతూ ఓ వీడియో ఆడియో విజువల్ వేసేస్తారు. ఆహా ఓహో అంటూ పొగడ్డం మినహా వీటికి అంత ప్రాధాన్యం ఉండదు. కానీ ఫ్యాన్స్‌కి అదే కావాలి కదా. అందుకే వాళ్లు ఇంకాస్త హుషారుగా ఇలాంటి ఏవీల వైపు ఆసక్తిగా ఓ లుక్కేస్తారు.
టెంపర్ ఆడియో ఫంక్షన్‌లోనూ ఇలాంటి ఏవీలు చూపించారు. అయితే బండ్ల గణేష్ కోసం చూపించిన ఏవీలో మాత్రం పవన్, చరణ్, బన్నీల జాడ లేకుండా జాగ్రత్త పడ్డారు నిర్వాహకులు. బండ్ల గణేష్ గురించి ప్రస్తావిస్తే తీన్‌మార్, గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే సినిమాల్నీ ప్రస్తావించాలి. అలా ప్రస్తావించాలంటే పవన్, చరణ్, బన్నీల్నితెరపై చూపించాలి.
అందుకే ఈ సినిమాల ప్రస్తావన తీసుకురాకుండా ఆంజనేయులు, బాద్‌షా సినిమాల్ని చూపిస్తూ ఏవీలను డిజైన్ చేశారు. ఇది గణేష్ తీసుకొన్న ముందు జాగ్రత్త, లేదంటే… నందమూరి ఫ్యాన్స్ ముందు మెగా హీరోల్ని పొగడ్డం ఎందుకూ అనుకొన్నాడా..?? ఏమో మరి. ఆ సంగతి గణేష్‌కే తెలియాలి.