మళ్లీ క్లాస్ సినిమానా?

ముకుంద సినిమాతో తెరంగ్రేటం చేసాడు వరుణ్ తేజ. ఇప్పుడు క్రిష్ తో రెండో సినిమా చేయడానికి డిసైడ్ అయిపోయాడు.అయితే యంగ్ హీరోలు అంతా మాస్ సినిమాలు చేయడానికి చూస్తుంటే ఇతగాడు అందరూ క్లాస్ డైరక్టర్…

ముకుంద సినిమాతో తెరంగ్రేటం చేసాడు వరుణ్ తేజ. ఇప్పుడు క్రిష్ తో రెండో సినిమా చేయడానికి డిసైడ్ అయిపోయాడు.అయితే యంగ్ హీరోలు అంతా మాస్ సినిమాలు చేయడానికి చూస్తుంటే ఇతగాడు అందరూ క్లాస్ డైరక్టర్ లను ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు క్రిష్ కూడా క్లాస్ డైరక్టరే. 

పైగా ఈ సినిమా సబ్జెక్ట్ దేశభక్తి సందేశంతో వుంటుందని వినికిడి. మెగాహీరోలు అంతా మాస్ జపం చేస్తుంటే, ప్రారంభం నుంచే వరుణ్ క్లాస్ అంటూ కలవరిస్తున్నాడు. మరి ఇది అతగాడి కెరీయర్ కు ఎంతలా ఉపకరిస్తుందో చూడాలి. 

ముచ్చటగా మూడో సినిమా పూరితో అంటున్నారు. అది మరి మాస్ మసాలా అన్నది గ్యారంటీ. ఎందుకంటే పూరి పొరపాటున కూడా క్లాస్ సినిమాల జోలికి వెళ్లడు కదా.