అంజ‌లి.. ఇక అంతేనా?

తెలుగ‌మ్మాయి అంజ‌లి ప‌రిస్థితి ఇప్పుడు అగ‌మ్యగోచ‌రంగా త‌యారైంది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా విజయాన్ని అంజ‌లి వాడుకోలేక‌పోయింది. ఇప్పుడు మ‌సాలా సినిమా అంజ‌లిని స‌రిగా వాడుకోలేక‌పోయింది. అంజ‌లి మంచి న‌టే. కానీ… దాన్ని…

తెలుగ‌మ్మాయి అంజ‌లి ప‌రిస్థితి ఇప్పుడు అగ‌మ్యగోచ‌రంగా త‌యారైంది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా విజయాన్ని అంజ‌లి వాడుకోలేక‌పోయింది. ఇప్పుడు మ‌సాలా సినిమా అంజ‌లిని స‌రిగా వాడుకోలేక‌పోయింది. అంజ‌లి మంచి న‌టే. కానీ… దాన్ని నిరూపించుకొనే అవ‌కాశాలెక్కడ వ‌స్తున్నాయ్. ఏదో ఉందిలే… అనే టైపు పాత్ర ఇప్పుడు మ‌సాలాలో చేసింది.

ఈ సినిమాతో అంజ‌లి భ‌విత‌వ్యం మ‌రింత ప్రశ్నార్థకంగా మారింది. అంజ‌లి ఈ సినిమాలో మ‌రింత లావుగా క‌నిపించింది.కాస్త ఎక్స్‌పోజింగ్‌చేద్దామ‌న్నా అది కూడా ఆమె ఒంటికి సెట్ అవ్వడం లేదు. ఇటు గ్లామ‌ర్‌పాత్రలు వేయ‌డం చేత‌కాక‌, అటు పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలూ రాక‌.. అంజ‌లి ఏమైపోతుందో ఏమో?  దానికి తోడు ఈ సినిమాలో కాస్త లావుగాక‌నిపించింది. 

ఇలా ఉంటే త‌మిళ తంబీల‌కు ఓకే ఏమోగానీ, తెలుగు ప్రేక్షకుల‌కు మాత్రం రుచించ‌దు. మ‌రి అంజ‌లి ఇప్పుడు త‌న కెరీర్‌ని ఎలా మ‌ల‌చుకొంటుందో ఏమో…?