వైసీపీ ధీర వ‌నిత‌లకు.. ద‌న్నుగా నిల‌వ‌రా జ‌గ‌న్‌?

సామాన్య ప్ర‌జాప్ర‌తినిధుల వీరోచిత పోరాటానికి జ‌గ‌న్ వెల‌క‌ట్ట‌లేరు.

క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు నీడ‌లా వెంట నిలిచేవారే నిజ‌మైన శ్రేయోభిలాషులు. వ్య‌క్తిగ‌తంగానూ, రాజ‌కీయ జీవితంలోనూ ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణం. అయితే 2024లో వైసీపీ ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకుంది. దీంతో వైసీపీతో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై నీలిమేఘాలు అలుముకున్నారు. ఈ నేప‌థ్యంలో వివిధ కార‌ణాల వ‌ల్ల స్థానిక సంస్థ‌ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాల‌తో పాటు ఇత‌ర‌త్రా వాటికి ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయి.

దీంతో వైసీపీ అస‌లు బ‌రిలో నిల‌బ‌డ‌లేద‌ని అంతా అనుకున్నారు. అధికారంలో ఉన్న కూట‌మి అదే ధీమాతో ఉండింది. కూట‌మే కాదు, వైసీపీ నాయ‌కులు కూడా అదే ఆలోచ‌న‌తో నిరుత్సాహంలో ప‌డిపోయారు. ఎందుకంటే, వైసీపీ ఓడిన త‌ర్వాత బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి లాంటి ద‌గ్గ‌రి బంధువు, ఎప్పుడూ జ‌గ‌న్‌కు నీడలా వెంట ఉన్న విజ‌య‌సాయిరెడ్డి లాంటి వాళ్లు పార్టీని వీడ‌డంతో, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు గ‌ట్టిగా నిల‌వ‌ర‌నుకున్నారు. అధికార కూట‌మి ప్ర‌లోభాలు, బెదిరింపుల‌కు చిన్న ప్రాణాలైన స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు నిల‌వ‌ర‌ని అనుకోవ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

కానీ క్రికెట్‌లో యోధులైన ఆట‌గాళ్లు త‌క్కువ ప‌రుగుల‌కే ఔటు అయి, జ‌ట్టు ఓడిపోతుంద‌ని అనుకున్న త‌రుణంలో బౌల‌ర్లు చెల‌రేగి, గెలిపించిన‌ప్పుడు క‌లిగే ఫీలింగ్‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యాన్ని కూడా ఆ కోణంలో చూడాల్సి వుంటుంది. వైసీపీకి భ‌విష్య‌త్‌పై మ‌ళ్లీ చిగురింప‌చేయ‌డంలో, ఇంత‌కాలం జగ‌న్‌కు ప‌ట్ట‌ని స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులే కీల‌క పాత్ర పోషించారు. వైసీపీ వీరోచితంగా బరిలో నిలిచింది, భ‌విష్య‌త్‌లో నిలుస్తుంద‌నే గ‌ట్టి సంకేతాల్ని స‌మాజానికి ఇచ్చింది. త‌ద్వారా కూట‌మి వెన్నులో వ‌ణుకు పుట్టించింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప్రధానంగా ముగ్గురు ధీర వ‌నిత‌ల గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గంలోని య‌ల‌మంచిలి మండ‌లం గుంప‌ర్రు ఎంపీటీసీ స‌భ్యురాలు కంబాల స‌త్య‌శ్రీ‌, మ‌ర్రివేముల ఎంపీటీసీ స‌భ్యురాలు వరిక‌ల్లు నాగేంద్ర‌మ్మ‌, ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలోని అంబేద్క‌ర్ కాల‌నీ-2 ఎంపీటీసీ స‌భ్యురాలు సృజ‌న‌. వైసీపీపై విధేయ‌త చాట‌డంలోనూ, పార్టీ కోసం ప్ర‌లోభాలు, బెదిరింపుల్ని లెక్క‌చేయ‌ని మొండిధైర్యంలోనూ ….ఈ ముగ్గురూ ముగ్గ‌రే. ఎవ‌రికీ ఎవ‌రూ తీసిపోరు.

చావ‌నైనా చ‌స్తా గానీ, పార్టీ మార‌న‌ని తెగేసి చెప్పిన విశ్వాసం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం య‌ల‌మంచిలి మండ‌లం గుంప‌ర్రు ఎంపీటీసీ స‌భ్యురాలు కంబాల స‌త్య‌శ్రీ‌ది. అనారోగ్యంతో భ‌ర్త మృతి చెందారు. వితంతు పింఛ‌న్‌, కొబ్బ‌రితోట‌పై వ‌చ్చే స్వ‌ల్ప‌ ఆదాయంతో ఆమె కుటుంబాన్ని పోషించుకుంటోంది. 6, 9వ త‌ర‌గ‌తులు చ‌దువుతున్న కుమార్తెలున్నారు. పార్టీ మారితే రూ.5 ల‌క్ష‌ల డ‌బ్బు, ఇద్ద‌రి పిల్ల‌ల చ‌దువు, ఉద్యోగం, పెళ్లి బాధ్య‌త తీసుకుంటామ‌ని టీడీపీ నేత‌లు ప్ర‌లోభ పెట్టినా, ఆమె మాత్రం త‌లొగ్గ‌లేదు. చివ‌రికి కిడ్నాప్ చేశార‌ని పిల్ల‌ల‌తో పోలీసుల‌కు ఫిర్యాదు చేయించారు. వైఎస్సార్ అంటే ప్రాణం, త‌న‌ కుమార్తెకు భార‌తి అని పేరు పెట్టుకున్నామంటూ…. వైసీపీకి త‌న మ‌ద్ద‌తు అని ఆమె తేల్చి చెప్పారు.

అమ్మా …నీ జీవితాన్ని సెటిల్ చేస్తామ‌ని చెప్పినా, టీడీపీ వైపు వెళ్ల‌ని ఆమె నిజాయితీని, నిబ‌ద్ధ‌త గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వైసీపీ, అలాగే వైఎస్సార్ కుటుంబంపై త‌న అభిమానాన్ని కొనే శ‌క్తి దేనికీ లేద‌ని ఆమె నిరూపించారు. మ‌రి ఆమె కుటుంబాన్ని కాపాడుకోవ‌డంలో వైసీపీ, అలాగే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్టాండ్ ఏంటి? ఇలాంటి ఒంట‌రి మ‌హిళ కుటుంబానికి ద‌న్నుగా నిల‌బ‌డ‌డం ద్వారా…కేడ‌ర్‌కు అండ‌గా వుంటాననే సంకేతాల్ని ఇవ్వ‌డానికి జ‌గ‌న్ సిద్ధ‌మా?

ఇక ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలోని త్రిపురాంత‌కం ఎంపీపీ స్థానానికి ప్ర‌తిష్టాత్మ‌క పోటీ జ‌రిగింది. అంబేద్క‌ర్ కాల‌నీ-2 ఎంపీటీసీ స‌భ్యురాలు సృజ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు అద్భుత‌హః అని చెప్ప‌క త‌ప్ప‌దు. వైసీపీ ఎంపీపీ అభ్య‌ర్థి ఆంజ‌నేయ‌రెడ్డి మీద సృజ‌న కుటుంబ స‌భ్యులతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించి, జైలుకు తీసుకెళ్లారు. కానీ ఎంపీపీ ఎన్నిక స‌మ‌యంలో వైసీపీకే త‌న ఓటు అని సృజ‌న చేయి ఎత్త‌డంతో టీడీపీ నాయ‌కులు షాక్‌కు గుర‌య్యారు.

ఎత్తిన ఆమె చేయిన దించ‌డానికి టీడీపీ మ‌ద్ద‌తుదారుడైన స‌భ్యుడు నిర్ల‌జ్జ‌గా, మ‌హిళ అని కూడా చూడ‌కుండా అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాడు. కానీ ఆమె ఎత్తిన చేయి దించ‌లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. వైసీపీకి ఎడారిలో ఒయాసిస్సులా క‌నిపించిన ధీర విధేయ వ‌నిత‌. ఇలాంటి వాళ్ల‌ను క‌దా వైసీపీ ప్రోత్సహించాల్సింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

పుల్ల‌ల‌చెరువు వైస్ ఎంపీపీ ఎన్నిక స‌మ‌యంలో మ‌ర్రివేముల ఎంపీటీసీ స‌భ్యురాలు వ‌రిక‌ల్లు నాగేంద్ర‌మ్మ చూపిన చొర‌వ‌… వైసీపీకే కాదు, అన్ని రాజ‌కీయ పార్టీల‌కు స్ఫూర్తిగా నిలిచింది. ముటుకుల స‌బ్‌స్టేష‌న్‌లో నైట్ వాచ్‌మ‌న్‌గా ఆమె భ‌ర్త పోల‌య్య ప‌ని చేస్తున్నారు. దీన్నిబ‌ట్టి ఆమె జీవితం ఎంత దుర్భ‌రంగా వుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఉపాధి పోతుంద‌నే భ‌యంతో కూట‌మికి ఓటు వేయాల‌ని ఆమెను భ‌ర్త ఆదేశించారు. అయితే అందుకు విరుద్ధంగా వైసీపీకే ఓటు వేసి, భ‌ర్త ఆదేశాల కంటే, విలువ‌లే ముఖ్య‌మ‌ని నిరూపించారు. ఓటు వేసిన త‌ర్వాత, భ‌ర్త‌తో గొడ‌వ వ‌స్తుంద‌నే ఉద్దేశంతో ఆమె పుట్టింటికి వెళ్ల‌డం విశేషం. ఇవ‌న్నీ విన‌డానికి బాగానే ఉన్నాయి. కానీ ఆచ‌రించే వాళ్లు ఎన్ని స‌మ‌స్య‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చి వుంటుందో, ఆలోచ‌నే భ‌య‌పెడుతోంది.

ఈ ముగ్గురు ధీర వ‌నిత‌ల‌ది…. ఒక్కొక్క‌రి జీవితం ఒక్కో గ్రంథం. ఒక్కొక్క‌రిది ఒక్కో వ్య‌థ‌. ఈ ముగ్గురు క‌న‌బ‌రిచిన స్ఫూర్తి, వైసీపీలో మాట‌ల్లో చెప్ప‌లేనంత స్ఫూర్తి నింపింది. ఇలాంటి వాళ్ల విష‌యంలో వైఎస్ జ‌గ‌న్… కేవ‌లం త‌న పత్రిక‌లో పాజిటివ్ క‌థ‌నం రాయ‌డం, ఎక్స్‌లో అభినందిస్తూ ఒక పోస్టు పెట్ట‌డంతోనే బాధ్య‌త తీరిపోదు. ఇలాంటి వాళ్ల‌కు ఆర్థికంగా, హార్థికంగా అండ‌గా నిలిచేందుకు జ‌గ‌న్ ముందుకు రావాలి. సామాన్య ప్ర‌జాప్ర‌తినిధుల వీరోచిత పోరాటానికి జ‌గ‌న్ వెల‌క‌ట్ట‌లేరు. కానీ వాళ్ల‌కు ద‌న్నుగా నిల‌బ‌డ‌డం ద్వారా, తాను విధేయుల ప‌క్ష‌మే త‌ప్ప‌, భ‌జ‌న‌ప‌రుల వైపు కాద‌ని జ‌గ‌న్ నిరూపించుకోవాలి. త‌ద్వారా వైసీపీకి మ‌రింత మంది క‌ర‌డుగ‌ట్టిన కేడ‌ర్‌, అలాగే ప్ర‌జాప్ర‌తినిధుల్ని త‌యారు చేసుకునే అవ‌కాశం వుంది.

25 Replies to “వైసీపీ ధీర వ‌నిత‌లకు.. ద‌న్నుగా నిల‌వ‌రా జ‌గ‌న్‌?”

  1. పార్టీ కోసం ముడివేళ కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షెళ్లమా “దీరవనిత” కాదా .. పార్టీ కోసం ప్రచారం చేసి పెట్టిన “తల్లిగారు” ధీర వనితా అవునా కదా ?

  2. వాళ్ల పదవులు అండ్ హోదా కేవలం మా లెవెనన్న బిక్ష.. ఆ బిక్ష కి “రిటర్న్ బిక్ష” గా మావోడికి అవసర0 అయినప్పుడు commitment చూపి నిరూపించుకోవాలి.. లేదంటే పార్టీ నుండి గేంటేసి ‘గుద్ద దె0గి వెలివెస్తాం..

    Same thing is applicable to all like శ్రీరెడ్డి, నగరి “పిర్రల ప0ది”, బెట్టింగ్ శ్యామల etc..

  3. అవినాష్ రెడ్డి కి దన్నుగా నిలబడడం మాత్రమే తెలుసు ఈ సింహానికి.

  4. ఇలాంటివి అన్ని మేము సజ్జల కి చెప్తాము, సజ్జల చేస్తాడా చేయడా అనేది మాకు అనవసరం..మేము అంతే..లేకపోతే సజ్జల దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ బయట పెడతాడు. కార్యకర్తలకు ఏం కావల్సి వచ్చిన మేము సజ్జలకే చెప్తాము. మీకు ఏం కావల్సి వచ్చిన సజ్జలకే చెప్పుకోండి. 🤪

  5. ఆ ఆడంగుల పేర్లు కూడా తెలిసి ఉండవు జగన్ రెడ్డి కి..

    వాడికి స్క్రిప్ట్ రాసి ఇస్తే.. వారానికొకసారి ఆంధ్ర కి వచ్చి చదివేసి వెళ్ళిపోతాడు..

    ఆ చదవడం లో కూడా వంద తప్పులు ఉంటాయి..

    ..

    చెప్పిందే చెప్పాల్సి రావడం.. నా ఖర్మ..

    జగన్ రెడ్డి కి పార్టీ నడిపే ఉద్దేశ్యం లేదు.. ఏదైనా కంపెనీ ఎత్తేసేటప్పుడు.. చిన్నగా ఉద్యోగులకు ఫీలర్లు వదులుతుంటారు.. మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు..

    ..

    ఈ ఆడంగులు కత్తులు తిప్పారని.. మీ జగన్ రెడ్డి డాలు పట్టుకుని యుద్ధానికి వచ్చేస్తాడు.. అని మీరు భ్రమ పడితే.. మీ అంతటి పిచ్చనాకొడుకులు లేరు అనుకోవాలి.. అంతే..

    1. రేపో మాపో మూసుకునేదానికి హడావుడి అవసరమా అని వైసీపీ లీడర్లు అనుకుంటున్నారు.

  6. ఇంకో రకంగా చెప్పాలి అంటే జగన్ ది కరెక్ట్ ఏమో నువ్వెంత అభివృద్ధి చేసిన ఆ టైం కు ప్రజలకు విసుగు వస్తె చాలు ఓడిస్తారు. తెలుగు వాళ్ళకు దేని మీద నిల్చొని ఓపిక లేదు. టైమ్ కోసం వేచి ఉండటమే మనం చేసేది పోలవరం కాటేసి అమరావతి అద్భుతాలు వేసిన ప్రజలు గెలిపిస్తే అనే గ్యారంటీ లేదు ఇక్కడ

  7. Maa apartment watch man, 2019 elections lo Jagan ki voltu vesanduku cheppu teesi kottukunnadu,

    Maa veedhi lo pan shop bachi, shop moosesi maree TDP tarupuna canvassing ki velladu, yentra ante, Brathikina chacchina cycle tho ne annadu

    inka inka

  8. Ante enti? Ladies ki vunnantha dhairyam kooda maa annaki ledantava? Maree antha piriki vaadila kanipistunnaada? Pani meeda Banglore ki velthe bhayapadi paaripothunnadu antava? Assembly lo antha sepu oorike koorchunte bore koaduthundani rakapothe bhayapaddadu antava? Chelli thalliki vunnantha dammu kooda ledantunnava? Enti asalu nee uddesam? Inko saari maa anannai pirikipanda, bhayastudu annavo?? jagratha, maa anna graama simha.. sorry.. single simham

Comments are closed.