‘భాయ్‌’తో కెరీర్‌ ముగిసినట్టేనా?

‘లీడర్‌’తో హీరోయిన్‌గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ ‘మిరపకాయ్‌’, ‘మిర్చి’లాంటి హిట్‌ సినిమాల్లో భాగం పంచుకుంది కానీ ఆ విజయాలతో ఆమె కెరీర్‌కి ఎలాంటి బెనిఫిట్‌ రాలేదు. ‘మిర్చి’తో విజయం సాధించిన తర్వాత ఆమెకి నాగార్జున…

‘లీడర్‌’తో హీరోయిన్‌గా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ ‘మిరపకాయ్‌’, ‘మిర్చి’లాంటి హిట్‌ సినిమాల్లో భాగం పంచుకుంది కానీ ఆ విజయాలతో ఆమె కెరీర్‌కి ఎలాంటి బెనిఫిట్‌ రాలేదు. ‘మిర్చి’తో విజయం సాధించిన తర్వాత ఆమెకి నాగార్జున ‘భాయ్‌’లో మాత్రమే నటించే అవకాశం దక్కింది. ఆ చిత్రం కూడా డిజాస్టర్‌ కావడంతో రిచాకి ఇప్పుడు అస్సలు అవకాశాలు లేకుండా పోయాయి. 

చేతిలో సినిమాలు లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లిపోయిన రిచా గంగోపాధ్యాయ ఖాళీ అయిపోయిన హీరోయిన్లు అంతా చెప్పే మాటలే మనకి వినిపిస్తోంది. చదువుని మధ్యలో ఆపేసి సినిమాల్లోకి రావడం వల్ల ఎడ్యుకేషన్‌ కంప్లీట్‌ కాలేదని, ఇప్పుడు చదువు మీద శ్రద్ధ పెడుతున్నానని, చదువు పూర్తయిన తర్వాత మళ్లీ తిరిగి వస్తానని అంటోంది. 

ఇరవై ఏడేళ్ల రిచా ఇప్పుడు చదువుపై దృష్టి పెట్టడం ఏమిటో గానీ, ఒక్కటైతే క్లియర్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెకి ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లు లేరు. నాలుగేళ్లలో ఆరు తెలుగు సినిమాలు, రెండు తమిళ చిత్రాలు, ఒక బెంగాలీ సినిమాలో నటించిన రిచా నటిగా తనని తాను ఇంప్రూవ్‌ చేసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. దాంతో పాటు అదృష్టమూ కలిసి రాలేదు. ఫలితంగా త్వరగా ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.