సన్నబఢే ప్రయత్నంలో పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా సన్నబడే ప్రయత్నం స్టార్ట్ చేసారు. ఇందుకోసం ఆయన విపరీతంగా జిమ్ చేస్తున్నారని బోగట్టా.  Advertisement అయ్యప్పన్ కోషియమ్ సినిమాలో పవన్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటిస్తున్న…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా సన్నబడే ప్రయత్నం స్టార్ట్ చేసారు. ఇందుకోసం ఆయన విపరీతంగా జిమ్ చేస్తున్నారని బోగట్టా. 

అయ్యప్పన్ కోషియమ్ సినిమాలో పవన్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గెటప్ కోసం పవన్ కసరత్తులు స్టార్ట్ చేసినట్లు బోగట్టా. ఇప్పటికే చాలా వరకు తగ్గారని, ఇంకా తగ్గే ప్రయత్నంలో వున్నారని తెలుస్తోంది. 

ఇలాంటి నేపథ్యంలో పవన్ కొత్త లుక్ ఎక్కడ లీక్ అవుతుందో అని యూనిట్ బోలెడు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా పోలీస్ యూనిఫారమ్ లో పవన్ లుక్ లీక్ కాకుండా చూసుకుంటున్నారు. 

అదే సమయంలో పవన్ బై మిస్టేక్ ఆ యూనిపారమ్ గెటప్ లో, సెట్ లోకి వచ్చిన జనసేన నాయకులో, మరొకరితోనో ఫొటోలు దిగితే, మొత్తం క్రేజ్ పోతుందని టెన్షన్ పడుతున్నారు.

పవన్ గతంలో జిమ్ కోసం, సన్నబడడం కోసం బెంగుళూరు వెళ్లేవారు. ఇప్పుడు ఇటు పార్టీ వ్యవహారాలు, అటు సినిమాలతో బిజీగా వుండడంతొ ఇక్కడే ఆయన రోజూ సమయం కేటాయించుకుని జిమ్ లో కండలు కరిగిస్తున్నారని బోగట్టా.

డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేయడం బాబు, లోకేష్‌కు అలవాటు

షీ హేజ్ టు గో ఎ లాంగ్ వే