బాబు కా హుకుమ్: ఇంకా బాగా ఇరికించండి!!

జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో భూ లావాదేవీలు, రెవెన్యూ వ్యవహారాల మీద సరికొత్త శ్వేత పత్రం విడుదల చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. Advertisement ఇప్పటికే అమరావతి రాజధాని మీద చంద్రబాబు నాయుడు…

జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో భూ లావాదేవీలు, రెవెన్యూ వ్యవహారాల మీద సరికొత్త శ్వేత పత్రం విడుదల చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

ఇప్పటికే అమరావతి రాజధాని మీద చంద్రబాబు నాయుడు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు.  ఆ పేరిట ఆయన చేసింది ఏమిటో అందరికీ తెలుసు. కేవలం జగన్మోహన్ రెడ్డిని నిందితుడి లాగా ప్రొజెక్టు చేయడం తప్ప ఆ శ్వేత పత్రం లో ఉన్న సీక్రెట్ ఇంకొకటి లేదు. అయితే అమరావతి శ్వేత పత్రం యావత్తు జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించడానికి ఉపయోగపడుతుందేమో తప్ప ఆయనకి ఇంకొక రకంగా నష్టం చేయదు. కానీ అంతకంటే తీవ్రంగా ఏమైనా చేయాలని కోరుకునే చంద్రబాబు ఇప్పుడు రెవెన్యూ వ్యవహారాల మీద శ్వేత పత్రం సిద్ధం చేయిస్తున్నారు. 

తమాషా ఏమిటంటే ఇప్పటికే వైసీపీ నాయకులు వీలయినంత మందిని నేరస్తులుగా చిత్రీకరించడానికి, కబ్జాకోరులుగా చూపించడానికి ఈ శ్వేత పత్రంలో ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఇవన్నీ వైసిపి నాయకుల ప్రోద్బలంతో జరిగినవే తప్ప తమ పాత్ర ఏమీ లేదని అధికారులు పేర్కొన్నట్లుగా అలాంటి వివరాలతో శ్వేత పత్రం సిద్ధమవుతున్నట్లుగా పచ్చ మీడియాలోనే వార్తలు వస్తున్నాయి. జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నాయకులే చేసినట్లుగా అధికారులు నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం. 

అయితే ఈ వివరాలు చాలవని ఇంకా పటిష్టంగా లోతుగా వివరాలు సేకరించాలని చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేసి అధికారులను పురమాయించినట్లుగా తెలుస్తోంది. ‘మరింత లోతుగా’ అంటే అర్థం ఏమిటో స్పష్టంగానే ఉంది. జగన్మోహన్ రెడ్డిని, ఆయన క్యాబినెట్లోని మంత్రులను మరింత గట్టిగా కేసుల్లో ఇరికించేందుకు వీలుగా శ్వేత పత్రంలో వివరాలు నమోదు కావాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. 

శ్వేత పత్రాలు అనేవి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలే కానీ.. తమ ప్రత్యర్ధుల మీద కక్ష సాధించడానికి ఫ్యాబ్రికేట్ చేసే విధంగా ఉండకూడదని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే అధినేత మనసెరిగి నివేదికలను తయారు చేసిన అధికారులు.. మరింతగా వైసీపీ వారిని బదనాం చేసేలా అవే నివేదికలను మళ్లీ తయారు చేయడంలో నిమగ్నం అయ్యారని సమాచారం.