‘అవార్డ్’ విన్నింగ్ అప్పు పంచాయతీ!

అప్పు అన్నది యూనివర్సల్ సబ్జెక్ట్. అప్పు లేని మనిషే వుండడు. అందులోనూ వ్యాపారాలు చేసే వారికి అన్నీ రొటేషన్లే. టాలీవుడ్ మీద ఆధారపడి అవార్డ్ ఫంక్షన్లు, ఇంకా ‘విష్ణు’మూర్తి మాదిరిగా ఇందుగలడు అందు లేడు…

అప్పు అన్నది యూనివర్సల్ సబ్జెక్ట్. అప్పు లేని మనిషే వుండడు. అందులోనూ వ్యాపారాలు చేసే వారికి అన్నీ రొటేషన్లే. టాలీవుడ్ మీద ఆధారపడి అవార్డ్ ఫంక్షన్లు, ఇంకా ‘విష్ణు’మూర్తి మాదిరిగా ఇందుగలడు అందు లేడు అనే విధంగా, సినిమా నిర్మాణంతో సహా చాలా వ్యాపారాలు వున్న పెద్ద మనిషి ఒకరికి కూడా అప్పులు వున్నాయి. అందులో ఓ పెద్ద అప్పు వుందట. జస్ట్ 35 కోట్లు. ఆ అప్పు ఇచ్చింది ఓ మార్వాడీ. హైదరాబాద్ కు చెందిన ఆయన ఇప్పుడు అమెరికాలో వుంటున్నారు. అది వేరే సంగతి.

అయితే ఈ పెద్ద మనిషి ఆ 35 కోట్ల అప్పు తీసుకుని చాలా కాలం కావడం, ఇంకా తీర్చే పరిస్థితి కనిపించకపోవడంతో, ఈ వ్యవహారం తెలంగాణలోని పెద్ద తలకాయల దగ్గర పంచాయతీకి వచ్చింది. కొందరు పెద్దలు ఇరు పక్షాలను కూర్చోపెట్టి, 30 రోజుల లోగా అప్పు తీర్చాల్సిందే అని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. లేదంటే అంత బాగోదు అని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

తనకు చాలా ప్రాజెక్ట్ లు వున్నాయని, వాటిల్లో డబ్బులు దండిగా వస్తాయని, మెగాస్టార్, బన్నీ లాంటి వాళ్లతో సినిమా ప్లానింగ్ లు వున్నాయని, వాటిలో కూడా దండిగా డబ్బులు వస్తాయని, కాస్త సమయం కావాలని ఆ పెద్ద మనిషి అడిగినట్లు తెలుస్తోంది.

కానీ ఈ కబుర్లు అన్నీ వినేసామని, 30 రోజుల్లోగా 35 కోట్లు కట్టకపోతే, పరిస్థితులు తీవ్రంగా వుంటాయని ఆ పెద్ద మనుషులు హెచ్చరిక జారీ చేసి, వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎలా తీరుస్తారో?

4 Replies to “‘అవార్డ్’ విన్నింగ్ అప్పు పంచాయతీ!”

Comments are closed.