నాకు హీరోలు తక్కువ, అన్నయ్యలు ఎక్కువ

టాలీవుడ్ లో తన సినీ ప్రస్థానంపై ఇప్పటికే గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సవివరంగా స్పందించింది నిహారిక కొణెదల. మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని కావడంతో, చాలామంది తనను సంప్రదించడానికి ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని…

టాలీవుడ్ లో తన సినీ ప్రస్థానంపై ఇప్పటికే గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సవివరంగా స్పందించింది నిహారిక కొణెదల. మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని కావడంతో, చాలామంది తనను సంప్రదించడానికి ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని అంగీకరించిన ఈమె, ఇప్పుడు మరో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

ఇండస్ట్రీలో ఎవరితో పడితే ఆ హీరోతో నటించలేనని అంటోంది నిహారిక. ఎందుకంటే, మెగా కాంపౌండ్ హీరోలతో కలిపి పరిశ్రమలో తనకు 11 మంది అన్నయ్యలున్నారని చెప్పుకొస్తోంది. కొంతమంది హీరోల్ని తను అన్నయ్యలుగా భావిస్తానని, వాళ్లతో సినిమాలు చేయలేనని అంటోంది.

“ఈమధ్య కాలంలో మంచి స్క్రిప్టులు రాలేదు. మరీ రొటీన్ కథలొచ్చాయి. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇండస్ట్రీలో ఉన్న 11 మంది హీరోలు నాకు అన్నయ్యలు అయిపోయారు. అదో సమస్య నాకు. నేను యూనివర్సల్ సిస్టర్ అయిపోయాను. నితిన్ నాకు అన్నయ్య. శర్వానంద్ కూడా నాకు అన్నయ్యే. ఇలాంటి అన్నలు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో.”

కమిటీ కుర్రాళ్లు ప్రమోషన్స్ కోసం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న నిహారిక, తన కెరీర్, కథల ఎంపికలకు సంబంధించి ఇండస్ట్రీకి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చింది. తనకు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు గ్లామర్ గా కనిపించడానికి ఓకే అంటోంది.

కరోనా తర్వాత హీరోయిన్ గా కనిపించని ఈ మెగా డాటర్, లాంగ్ గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమాకు సంతకం చేసింది. అక్టోబర్ నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందని, తమిళ్ లో ఆల్రెడీ ఓ సినిమాను పూర్తిచేశానని వెల్లడించింది.

15 Replies to “నాకు హీరోలు తక్కువ, అన్నయ్యలు ఎక్కువ”

  1. ఏమిటో… సందర్భమో , అసందర్భమో కానీ….

    పతివ్రత పరమాన్నం వండితే, తెల్లార్లూ చల్లారలేదంట..!

    1. సందర్భం పతివ్రత గ నిరూపించుకోవడం కానీ.

      సమయం : త్రేతా యుగం లో పాతివ్రత్యం నిరూపించుకోవాలంటే నిప్పు లో నడవాలి, కానీ కలియుగం లో నిప్పు ఏడిస్తే చాలు..

Comments are closed.