‘బచ్చన్’ హిందీ పైత్యం తెగ్గోసారు

ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకుని, మన అభిరుచికి దాన్ని మ్యాచ్ చేసి, మధ్యే మార్గంగా కంటెంట్ అందించాలి. అలా కాకుండా మనకు కిషోర్ కుమార్, మహ్మద్ రఫీ, కుమార్ షాను పాటలు ఇష్టం కదా…

ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకుని, మన అభిరుచికి దాన్ని మ్యాచ్ చేసి, మధ్యే మార్గంగా కంటెంట్ అందించాలి. అలా కాకుండా మనకు కిషోర్ కుమార్, మహ్మద్ రఫీ, కుమార్ షాను పాటలు ఇష్టం కదా అని సినిమా నిండా వాటిని కుమ్మేస్తే జ‌నం ఇబ్బంది పడతారు. మిస్టర్ బచ్చన్ లో అదే జ‌రిగింది. ఈ జ‌నరేషన్ కు పట్టని, మరో జ‌నరేషన్ కు పెద్దగా గుర్తులేని హిందీ పాటలు అన్నీ సినిమాలో గుది గుచ్చేసారు. సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి వున్న కారణాల్లో ఇది ఒకటి మాత్రమే.

ఇప్పుడు జ‌నం నాడి పసిగట్టారు. అందువల్ల సినిమాలో ఈ హిందీ పాటల గోలను కాస్త తెగ్గోసారు. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ నే ట్విట్టర్ వేదిక మీద అధికారికంగా ప్రకటించారు. వీకెండ్ రెండు రోజులు వున్నాయి. రాఖీ సెలవు వుండనే వుంది. అందువల్ల మూడు రోజులు వసూళ్లకు చాన్స్ వుంది. అందుకే లేట్ చేయకుండా ఈ డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ వారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద సినిమాలు రెండింటికీ సరైన టాక్ రాలేదు. తంగలాన్ కు సమీక్షలు బాగున్నా, కలెక్షన్లు ఇంకా పుంజుకోవాల్సి వుంది. ఆయ్ సినిమా కు కూడా టాక్ ఇంకా జ‌నంలోకి వెళ్లాల్సి వుంది. అందుకే ఇప్పుడు సుమారు పది నిమిషాలు కట్ చేసి, బచ్చన్ సినిమాను కొత్తగా అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది.

7 Replies to “‘బచ్చన్’ హిందీ పైత్యం తెగ్గోసారు”

Comments are closed.