ప్రభాస్ సరసన సూపర్ డాన్సర్

క్లాసికల్ నుంచి వెస్ట్రన్ వరకు ఏ తరహా డాన్స్ అయినా ఈమె ఇట్టే పెర్ఫార్మ్ చేస్తుంది.

ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభమైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు ఈరోజు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో హీరోయిన్ గా ఇమాన్వి అనే కొత్తమ్మాయిని తీసుకున్నారు.

హను రాఘవపూడి హీరోయిన్ సెలక్షన్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటుంది. కథకు తగ్గట్టు అతడు తన హీరోయిన్లను ఎంపిక చేసుకుంటాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీతారామం సినిమా కోసం మృణాల్ ఎంపిక.

ఇప్పుడు ప్రభాస్ మూవీ కోసం ఇమాన్విని తీసుకున్నాడు. ఈమె గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ది బెస్ట్ డాన్సర్. ఇనస్టాగ్రామ్, యూట్యూబ్ లో ఈమెకు లక్షల్లో అభిమానులున్నాయి. క్లాసికల్ నుంచి వెస్ట్రన్ వరకు ఏ తరహా డాన్స్ అయినా ఈమె ఇట్టే పెర్ఫార్మ్ చేస్తుంది.

ఇలాంటి అమ్మాయిని ప్రభాస్ మూవీ కోసం తీసుకున్నాడంటే, ఇందులో కచ్చితంగా డాన్స్ కు సంబంధించిన అంశాలు ఉండే ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇది పీరియాడిక్ సినిమా. స్వతంత్రానికి ముందు జరిగిన కథతో వస్తున్న సినిమా కాబట్టి, కచ్చితంగా ఇందులో క్లాసికల్ డాన్స్ ఎలిమెంట్స్ ఉండే ఉంటాయి.

అయితే ఈ సినిమాలో ఈమె మెయిన్ హీరోయిన్ రోల్ పోషిస్తుందా లేక కీలక పాత్ర కోసం తీసుకున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇతర కీలక పాత్రల కోసం మిథున్ చక్రవర్తి, జయప్రద లాంటి సీనియర్లను తీసుకున్నారు.

ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ ఇతడు 3 పాటలు కంపోజ్ చేసినట్టు దర్శకుడు ఇదివరకే ప్రకటించాడు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ నెల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

7 Replies to “ప్రభాస్ సరసన సూపర్ డాన్సర్”

Comments are closed.