సాయిపల్లవికి అన్యాయం జరిగిందా..?

ఆ ఏడాది నిత్యామీనన్ తో పాటు, సాయిపల్లవి కూడా ఓ అద్భుతమైన సినిమా చేసింది.

జాతీయ అవార్డులు ఎప్పుడు ప్రకటించినా, ఓ సెక్షన్ అసమ్మతి రాగం వినిపిస్తూనే ఉంటుంది. ఒక నటుడు లేదా నటికి రావాల్సిన అవార్డు మరొకరికి ఇచ్చారని.. ఫలానా సినిమా లేదా నటుడ్ని గుర్తించలేదంటూ చర్చ జరగడం కామన్. ఈసారి అలాంటి చర్చ సాయిపల్లవి చుట్టూ తిరుగుతుంది.

70వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఉత్తమ నటిగా నిత్యామీనన్ ఎంపికైన సంగతి తెలిసిందే. తిరుచిత్రాంబళం సినిమాలో నటనకు గాను ఆమెను ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. అయితే ఆ స్థానంలో ఉండాల్సింది నిత్యామీనన్ కాదు, సాయిపల్లవి అనేది కొంతమంది వాదన.

2022లో వచ్చిన సినిమాలకు ఈ అవార్డులు ప్రకటించారు. ఆ ఏడాది నిత్యామీనన్ తో పాటు, సాయిపల్లవి కూడా ఓ అద్భుతమైన సినిమా చేసింది. దాని పేరు గార్గి. అప్పట్లో సౌత్ ను ఓ ఊపు ఊపింది ఈ సినిమా. తమిళ్, మలయాళం, తెలుగు అనే తేడా లేకుండా అందర్నీ కదిలించింది.

ఈ సినిమాకుగాను ఉత్తమ నటిగా సాయిపల్లవికి కచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని అంతా ఊహించారు. సాయిపల్లవి కూడా ఆశలు పెట్టుకుంది. కానీ ఆమెకు అదృష్టం దక్కలేదు.

దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో అవార్డులపై పెద్ద చర్చ పెట్టారు. నిజానికి ఈ స్థాయిలో సాయిపల్లవిపై చర్చ జరిగి ఉండేది కాదు. దీనికి మరో కారణం కూడా ఉంది. ఈసారి అవార్డుల్లో నిత్యామీనన్ తో పాటు.. మానసి పరేఖ్ అనే నటికి కూడా ఉత్తమ నటి అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఇది సాయిపల్లవి అభిమానులకు మరింత కోపం తెప్పించింది.

38 Replies to “సాయిపల్లవికి అన్యాయం జరిగిందా..?”

  1. అందరినీ సంతృప్తి పరచాలి అంటే భాష కి ఒక ఉత్తమ నటుడు / నటి అని అన్ని భాష లకి అన్ని కేటగిరీ ల్లో ఇచ్చినా ఇంకా చర్చ జరుగుతూనే ఉంటుంది.

        1. నిత్యా మీనన్ ది కర్ణాటక! బెంగళూర్ లో స్థిరపడిన మలయాళీ కుటుంబం. ఆమె పుట్టింది కూడా కర్ణాటక లోనే! ఈ విషయం బీజేపీ కి తెలియదంటారా? అయినా ఇప్పుడు కేరళాలో ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం అనాలసిస్ sir!

      1. Sai pallavi nit from Kerala..she is from coimbatore.it’s in Tamilnadu only… Sai pallavi very first movie in Malayalam.so..u felt like she is from Kerala..but actually she is from coimbatore only

    1. Thiruchitrambalam – Adi kooda Tamil movie ne . I dont think there will be any political interference because both Gargi and Thiruchitrambalam are non political movies

        1. నేను మా అమ్మగారికే కాదు, మీ అమ్మగారికి కూడా గౌరవం ఇస్తాను

          “అమ్మ ఎవరికైనా అమ్మే” సోదరా…

  2. గార్గి.. ఒక్కటే కాదు.. విరాట పర్వం కూడా same year చేసింది.. ఆ movie lo kuda excellent performance 👌 ఛ ఛ దానికి National award ivvali…

    Thiru lo నిత్యా బాగా చేసింది.బట్ అవార్డు ఇచ్చేంత రోల్ కాదు

  3. అసలు అన్యాయం జరిగింది మీకు…లేకపోతె అన్న కోసం గుడ్డ లిప్పుకుని మరీ సపోర్ట్ చేస్తారు మంచి చెప్తారు ఐన కానీ సోషల్ మీడియా విభాగం మీకు దక్కలేదు..ఇప్పుడు మీ అన్యాయం గురించి కాకుండా వేరేవారికో జరిగిన (??!!) అన్యాయం గురించే ఏడుస్తున్నారు

  4. సాయి పల్లవి కి మరియు జగన్ కి అన్యాయం జరిగింది, ఇద్దరు మాంచి నటులు !! జగన్ ఐతే oscar range!!

Comments are closed.