రేవంత్ స‌ర్కార్‌లా వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా నిల‌వ‌లేదేం?

వ‌ర‌ద, తుపాను బాధితుల‌కు రేవంత్‌రెడ్డి స‌ర్కార్ అండ‌గా నిలిచింది. ఆ రీతిలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిల‌వ‌డం లేద‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తుపాను బీభ‌త్సం సృష్టించింది. వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. దీంతో ప్రాణ‌,…

వ‌ర‌ద, తుపాను బాధితుల‌కు రేవంత్‌రెడ్డి స‌ర్కార్ అండ‌గా నిలిచింది. ఆ రీతిలో చంద్ర‌బాబు స‌ర్కార్ నిల‌వ‌డం లేద‌నే విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తుపాను బీభ‌త్సం సృష్టించింది. వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. దీంతో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించింది.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కార్ బాధితుల‌కు మ‌నో ధైర్యం ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన ప్ర‌తి కుటుంబానికి రూ.16,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌ని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం విశేషం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు అండ‌గా నిలిచేందుకు రూ.5 ల‌క్ష‌లు చొప్పున ప‌రిహారం అంద‌జేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అలాగే ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టించి ఇస్తామ‌న్నారు. ముంపున‌కు గురైన ప్ర‌తి ఎక‌రాకు రూ.10 వేలు అంద‌జేస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు.

వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌జానీకాన్ని ఈ సాయం బ‌య‌ట ప‌డేయదు. అయితే ఎంతోకొంత మాన‌సిక ధైర్యాన్ని ఇస్తుంది. ప్ర‌భుత్వం త‌మ గురించి ఆలోచిస్తోంద‌న్న న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది. ఏపీలో మాత్రం ఇంత వ‌ర‌కూ ఎలాంటి ఆర్థిక భ‌రోసా లేదు. ఆ విష‌య‌మై సీఎం చంద్ర‌బాబు ఎందుక‌నో చ‌ర్చించ‌డం లేదు. మ‌రోవైపు ఉత్త‌రాంధ్ర‌ను తుపాను అత‌లాకుతలం చేస్తోంది. అస‌లే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తుపాను విల‌య‌తాండ‌వం సృష్టించింది. ముఖ్యంగా విజ‌య‌వాడలోని ముంపు ప్రాంతాలు బ‌య‌ట‌ప‌డాలంటే ప్ర‌భుత్వం పెద్ద మ‌న‌సుతో ఆదుకోవాలి.

ఎక‌రాకు క‌నీసం రూ.15 వేలు, ప్ర‌తి కుటుంబానికి రూ.25 వేలు, చ‌నిపోయిన కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ఉంది. రేవంత్‌రెడ్డి స‌ర్కార్ కంటే మిన్న‌గా ఆదుకునేందుకు సీఎం చంద్ర‌బాబు పెద్ద మ‌న‌సుతో ముందుకు రావాలి.

6 Replies to “రేవంత్ స‌ర్కార్‌లా వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా నిల‌వ‌లేదేం?”

  1. జగ్గడు సొంత డబ్బుతో ప్రజల సంక్షేమం కోసం బట్టన్లు నొక్కాల్సింది ఇప్పుడే, మాంచిగా పాపులర్ అవుతాడు.

Comments are closed.