ఒకేసారి నాలుగు వేల మంది ఇంటికి

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకేసారి నాలుగు వేల మందిని ఇంటికి పంపించే కార్యక్రమం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తలపెట్టింది. ఇంత పెద్ద ఎత్తున కాంట్రాక్టు కార్మికులను తొలగించడం…

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకేసారి నాలుగు వేల మందిని ఇంటికి పంపించే కార్యక్రమం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తలపెట్టింది. ఇంత పెద్ద ఎత్తున కాంట్రాక్టు కార్మికులను తొలగించడం గతంలో ఎపుడూ లేదని ఉక్కు కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి.

ఇంత మందిని తొలగించడం వెనక ప్రైవేటీకరణ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. తొలగించిన కార్మికుల గేట్ పాసులను తీసుకోవాలని ఆయా విభాగాధిపతుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. వారంతా ఉక్కు కర్మాగారంతో బంధాలు తెంపుకున్నట్లే అని అంటున్నారు.

దీంతో రగిలిపోతున్న కార్మిక సంఘాలు తొలగించిన కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 30న ఇదే అంశం మీద భారీ నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఈ అంశం ఉక్కులో వేడిని రగిలిస్తోంది. తాడో పేడో తేల్చుకోవడానికి కార్మిక సంఘాలు రెడీగా ఉన్నాయి.

ఒక వైపు ప్రైవేటీకరణ చేయబోమని చెబుతున్నారని సెయిల్ లో విశాఖ ఉక్కుని విలీనం చేయడానికి కేంద్రం ఆలోచిస్తోంది అని కూడా చెబుతున్నారని మళ్లీ ఇదేమిటి అని కార్మిక సంఘ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.

విశాఖ ఉక్కు విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నారా అన్నది కూడా సందేహంగా ఉంది అంటున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులను తీసేది ఉద్యోగులను కుదించి ఆ మీదట విలీనం చేసినా ఎవరికి ఉపయోగం అని అంటున్నారు. ఉక్కు కార్మికుల ఉద్యోగులకు భద్రతకి ఉక్కు యాజమాన్యంతో పాటు కేంద్రం హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

16 Replies to “ఒకేసారి నాలుగు వేల మంది ఇంటికి”

  1. అపరా బాబు నీ ఓవర్ ఎక్ససిట్మెంట్, ప్రైవేట్ పరం ప్రస్తుతానికి చెయ్యం అని చెప్పారు కదా? రన్నింగ్ కాపిటల్ కి లోన్ కావాలంటే ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్స్ చెప్పినట్టు చెయ్యాలి. రిస్ట్రుక్చరింగ్ చేస్తున్నారేమో. అయినా కాంట్రాక్టు వర్కర్స్ అంటేనే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసెయ్యొచ్చని, దానికి గోల ఏందీ. లోన్ కోసం ఖాళీ స్థలాలు అమ్మిన అమ్మొచ్చు. వేచి చూద్దాం ఏమి జరుగు/ ద్దో.

Comments are closed.