ఛిల్ అవుతున్న హీరోయిన్లు

నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండే హీరోలు అప్పుడప్పుడు సేదతీరుతుంటారు. అయితే వీళ్ల కంటే ఎక్కువగా హీరోయిన్లు ఛిల్ అవుతుంటారు. ఏమాత్రం గ్యాప్ దొరికినా ఆలస్యం చేయకుండా ఫ్లయిట్ ఎక్కేస్తారు. ఏదో ఒక తీరానికి…

నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండే హీరోలు అప్పుడప్పుడు సేదతీరుతుంటారు. అయితే వీళ్ల కంటే ఎక్కువగా హీరోయిన్లు ఛిల్ అవుతుంటారు. ఏమాత్రం గ్యాప్ దొరికినా ఆలస్యం చేయకుండా ఫ్లయిట్ ఎక్కేస్తారు. ఏదో ఒక తీరానికి చేరుకొని కొన్ని రోజులు హాలిడే ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం కొంతమంది హీరోయిన్లు అదే పనిలో ఉన్నారు.

హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం శ్రీలంకలో ఉంది. తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమె శ్రీలంకలో ల్యాండ్ అయింది. అందమైన బీచ్ రిసార్ట్ లో హొయలొలికిస్తూ ఫొటోలకు పోజులిస్తోంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. రీసెంట్ గా విజయ్ సినిమాకు కమిట్ అయింది పూజ. అది సెట్స్ పైకి వచ్చేంతవరకు ఈమె ఫ్రీ.

ఇక మెహ్రీన్ సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె దేశంలో తక్కువగా, విదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. సినిమా అవకాశాలు అంతంతమాత్రంగా వస్తుండడంతో, పూర్తిస్థాయిలో పర్యటనలు షురూ చేసింది. ప్రతి నెల ఏదో ఒక దేశంలో ఆమె ప్రత్యక్షమౌతోంది. ప్రస్తుతం లండన్ లో ఉన్న మెహ్రీన్, అక్కడ్నుంచి అప్ డేట్స్ అందిస్తోంది.

మొన్నటివరకు విశ్వం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న కావ్య థాపర్, తన వృత్తి జీవితానికి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇండొనేషియాలోని బాలిలో సేదతీరుతోంది. ఓ వారంలో తిరిగొచ్చి కొత్త సినిమా సెట్స్ లో జాయిన్ అవుతుంది.

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా హాలిడే ట్రిప్ లో ఉంది. తన ఫ్రెండ్స్ ను వెంటేసుకొని ఆమె మొరాకోలో విహరిస్తోంది. అక్కడి ప్రకృతి అందాల మధ్య, తన అందాల్ని ప్రదర్శిస్తూ బిజీగా ఉంది.

వీళ్లు మాత్రమే కాదు, మరికొంతమంది ముద్దుగుమ్మలు కూడా ప్రస్తుతం విదేశాల్లోనే ఉన్నారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ అబుదాబిలో, కావ్య కల్యాణరామ్ టర్కీలో పర్యటిస్తున్నారు.

2 Replies to “ఛిల్ అవుతున్న హీరోయిన్లు”

Comments are closed.