అప్పుల‌పై త‌వ్వ‌డానికి ఏముంది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ రోజుకో మాట చెబుతోంది. అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన స‌మ‌యంలో రూ.6.50 ల‌క్ష‌ల కోట్ల లోపు అప్పులున్న‌ట్టు ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీంతో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ రోజుకో మాట చెబుతోంది. అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన స‌మ‌యంలో రూ.6.50 ల‌క్ష‌ల కోట్ల లోపు అప్పులున్న‌ట్టు ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇంత‌కాలం వైసీపీ ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌ల కోట్లు, రూ.12 ల‌క్ష‌ల కోట్లు, రూ.14 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసిందని, రాష్ట్రం శ్రీ‌లంక అవుతుంద‌ని కూట‌మి నేత‌లు దుష్ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే స‌మ‌యానికి మాత్రం అస‌లు నిజం ఏంటో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చ‌ట్ట‌స‌భ వేదిక‌గా చెప్పాల్సి వచ్చింది. దీంతో ఇంటాబ‌య‌టా కూట‌మి స‌ర్కార్ చీవాట్లు తినాల్సి వ‌స్తోంది. ఇంత‌కాలం వైసీపీ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేశార‌ని, సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డానికి ఆర్థిక ఇబ్బందులే ఆటంక‌మ‌ని చెప్పే మాట‌లు కూడా అబ‌ద్ధ‌మ‌ని జ‌నం అనుకునే ప‌రిస్థితి. అయితే చంద్ర‌బాబు మాత్రం అసెంబ్లీలో మ‌ళ్లీ మాట మార్చారు.

వైసీపీ హ‌యాంలో అప్పులు రూ.9.56 ల‌క్ష‌ల కోట్లు అని చెప్పారు. బాబు పూట‌కో మాట మార్చ‌డంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అప్పుల‌పై చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెప్ప‌డ‌మే కాకుండా, ఇంకా త‌వ్వితే ఎన్ని అప్పులుంటాయో అన‌డం అన్యాయ‌మ‌న్నారు. త‌వ్వ‌డానికి ఏముంది? అని బుగ్గ‌న నిల‌దీశారు.

ప్ర‌తి కార్పొరేష‌న్ మీ చేతిలో ఉంద‌ని బుగ్గ‌న గుర్తు చేశారు. ఆడిట్ చేస్తారు క‌దా అని ఆయ‌న అన్నారు. గుంజీలు ఎవ‌రు తీయాలో మీరే ఆలోచించుకోవాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్‌కు బుగ్గ‌న చుర‌క‌లు అంటించారు.

5 Replies to “అప్పుల‌పై త‌వ్వ‌డానికి ఏముంది?”

Comments are closed.