సీమ‌కు అన్యాయం జ‌రుగుతుంటే షర్మిల మౌనం!

గ‌త ఐదు నెల‌ల్లో రాయ‌ల‌సీమ‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, కూట‌మి స‌ర్కార్ ప‌ది అన్యాయాలు, ద్రోహాలు చేసింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్ ఎన్‌.తుల‌సిరెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆలోచింప‌జేస్తోంది. అదేంటో గానీ,…

గ‌త ఐదు నెల‌ల్లో రాయ‌ల‌సీమ‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, కూట‌మి స‌ర్కార్ ప‌ది అన్యాయాలు, ద్రోహాలు చేసింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్ ఎన్‌.తుల‌సిరెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆలోచింప‌జేస్తోంది. అదేంటో గానీ, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌కు మాత్రం ఇవేవీ క‌నిపించ‌డం లేదు. ష‌ర్మిల‌కు త‌న అన్న వైఎస్ జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి స‌బ్జెక్టుల‌ను వెతుక్కోవ‌డం మిన‌హా, మ‌రే ఆలోచ‌న లేన‌ట్టుంది.

వైఎస్సార్ జిల్లా కొప్ప‌ర్తి నుంచి ప‌రిశ్ర‌మ మొద‌లుకుని లోకాయుక్త‌, మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాలు, అలాగే ఇత‌ర‌త్రా ప్ర‌భుత్వ సంస్థ‌ల‌న్నింటిని అమ‌రావ‌తికి త‌ర‌లిస్తుండ‌డంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు తుల‌సిరెడ్డి చ‌క్క‌గా వివ‌రించారు. కానీ ఏపీ కాంగ్రెస్‌కు సార‌థ్యం వ‌హిస్తున్న ష‌ర్మిల‌కు మాత్రం, సీమ‌కు బాబు స‌ర్కార్ చేస్తున్న అన్యాయం, ద్రోహం క‌నీసం చీమ కుట్టిన‌ట్టైనా అనిపించ‌డం లేద‌నే విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాయ‌ల‌సీమ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలిగా ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఇదే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ఏదైనా ఇబ్బంది త‌లెత్తితే మాత్రం.. నేనున్నా అన్న‌ట్టుగా వెంట‌నే మీడియా ముందుకు ష‌ర్మిల రావ‌డాన్ని కాంగ్రెస్ నాయ‌కులే త‌ప్పు ప‌డుతున్నారు. కేవ‌లం వ్య‌క్తిగ‌త ఎజెండాతో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడైన వైఎస్ జ‌గ‌న్‌పై నిత్యం విమ‌ర్శ‌ల్ని ష‌ర్మిల చేస్తున్నార‌నే అభిప్రాయం వుంది.

పులివెందుల వైద్య క‌ళాశాల‌కు మంజూరైన 50 సీట్ల‌ను తిర‌స్క‌రిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి లేఖ రాసిన‌ప్పుడు మాత్ర‌మే ష‌ర్మిల స్పందించారు. ఇంత‌కు మించి, రాయ‌ల‌సీమ నుంచి త‌ర‌లుతున్న వివిధ కార్యాల‌యాల గురించి ష‌ర్మిల నోరెత్తిన పాపాన పోలేదు. త‌న మౌనం ద్వారా చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ష‌ర్మిల వంత పాడుతోంద‌నే అనుమానాలు కాంగ్రెస్ నాయ‌కులే వ్య‌క్తం చేస్తున్నారు.

13 Replies to “సీమ‌కు అన్యాయం జ‌రుగుతుంటే షర్మిల మౌనం!”

  1. ప్రజలకు చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది. ఆమె వ్యవహార శైలి. మరీ ఇంత కక్షా?

  2. రాయలసీమ ఉద్యమం తప్ప వైసీపీ కి ఇక ఆప్షన్ లేదు కోస్తాలో గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎలేచ్షన్స్ లో పోటీచేయటానికి బయపడుతుంటే ఇక కోస్తాలో దాని ఉనికి ప్రశ్నర్ధకమవుతుంది పోటీచేస్తే కాంగ్రెస్ ని మించి రాకపోతే రేపు పొత్తుకు కాంగ్రెస్ అంగీకరించదు కాంగ్రెస్ పుంజుకొంటే వైసీపీ దుకాణం బంద్ ఇక ఓట్లు తెచ్చుకోలేకపోతే అక్రమాస్తుల కేసులు ముంచుకొస్తాయి రాజకీయ ముసుగు తొలిగిపోతే మోడీ లోపలెసెయ్యడానికి ఎంతో సమయం పట్టదు

  3. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ? అప్పుడు ఆస్తులు అన్ని తెలంగాణాకి ఇచ్చి ఇప్పుడు రాజకీయాలు చేయటానికి సిగ్గు ఉండాలి

Comments are closed.