రామ్మోహన్ దే బాధ్యత

ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి నిధులను తీసుకుని రావడంలో నరేంద్ర మోడీ కేబినెట్ లో కీలకమైన ఫోర్ట్ ఫోలియోను చూస్తున్న కె రామ్మోహనాయుడుదే బాధ్యత అని అంటున్నారు. ఏపీ అప్పుల ఊబిలో ఉంది. అనేక…

ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి నిధులను తీసుకుని రావడంలో నరేంద్ర మోడీ కేబినెట్ లో కీలకమైన ఫోర్ట్ ఫోలియోను చూస్తున్న కె రామ్మోహనాయుడుదే బాధ్యత అని అంటున్నారు. ఏపీ అప్పుల ఊబిలో ఉంది. అనేక పధకాలు అమలు చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు పట్టాలెక్కించాలి.

అమరావతి రాజధాని ఒక పెద్ద ప్రాజెక్టుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎప్పటికపుడు నిధులు తేవాల్సి ఉంది. ఏపీకి సంబంధించి కేంద్రం ఉదారంగా నిధులు ఇవ్వాలి. అనేక అనుమతులు ఇవ్వాలి. ఎన్డీయేలో కీలకమైన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యవహరించబోతున్నారు

టీడీపీ ఎంపీలతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు ఇతర ప్రాజెక్టుల విషయంలో మొత్తం బాధ్యతను ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి మీదనే చంద్రబాబు పెట్టారని అంటున్నారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంతో చర్చిస్తామని రామ్మోహన్ తెలిపారు. 2047 విజన్ ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని దానికి కేంద్రం మద్దతు ఎంతో అవసరం అని అన్నారు.

ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉందని దానికి కేంద్రం కూడా సహకారం అందించాల్సి ఉందని అన్నారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన వాటాను అన్ని విషయాల్లో దక్కించుకోవడంతో పాటు మరింతగా కేంద్ర సాయం గురించి ప్రస్తావిస్తామని అన్నారు. పౌర విమానయాన మంత్రిగా రామ్మోహన్ ఏపీకి ఎయిర్ పోర్టుల ఏర్పాటు విషయంలో చొరవ చూపిస్తున్నారు. కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకుని రావడంలో కూడా మరింత ఫోకస్ పెడతామని అంటున్నారు.

6 Replies to “రామ్మోహన్ దే బాధ్యత”

  1. ఇప్పటికి ఇది మూడోసారి… ఈయన ఫాదర్ తో కలిపి దాదాపు 30 ఏళ్ళు ఏలారు శ్రీకాకుళం ని

    ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఒక్కటి అంటే ఒక్కటి చేసిన పని ఇది శ్రీకాకుళం కి అని ఒక్కటి కూడా లేదు..

    బహుశా ఇంత విశ్వాసఘాతకంగా ఎవరూ ఉండరేమో… కనీసం తీసుకున్న జీతానికి కొంచెమైనా న్యాయం చెయ్యాలి కదా..

    1. ఇన్ని రోజుల్లో జగనన్న లాగా ఒక లక్ష కోట్లను అయినా దొంగలేదని బాధపడుతున్నావా..

Comments are closed.