మాస్ మత్తు వదిలేసిందా..?

మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్..” అంటూ రిలీజైన ఈ లుక్ లో సింపుల్ గా, పక్కింటి కుర్రాడిలా కనిపిస్తున్నాడు రామ్.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత రామ్ పోతినేని ఆలోచన విధానం, కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. తన సినిమాల్లో మాస్-యాక్షన్ మస్ట్ అని ఫిక్స్ అయిపోయాడు ఈ హీరో. అక్కడ్నుంచి వరుసగా ఫ్లాపులు రావడం మొదలయ్యాయి.

రీసెంట్ గా వచ్చిన స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలైతే ప్రేక్షకులకే కాదు, రామ్ కు కూడా చుక్కలు చూపించాయి. దెబ్బకు థింకింగ్ మారిపోయింది. ఇప్పుడు కొత్త సినిమా కోసం కొత్త కథ, కొత్త జానర్ ఎంచుకున్నాడు ఈ హీరో.

36 ఏళ్ల ఈ హీరో ఇప్పుడు మరోసారి కాలేజీ స్టూడెంట్ లా కనిపించబోతున్నాడు. కొత్త సినిమాలో రామ్ లుక్ ను రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ఇందులో సాగర్ అనే కుర్రాడి పాత్రలో రామ్ కనిపించబోతున్నాడు.

“మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు.. మీ సాగర్..” అంటూ రిలీజైన ఈ లుక్ లో సింపుల్ గా, పక్కింటి కుర్రాడిలా కనిపిస్తున్నాడు రామ్. ఓ పాత సైకిల్ ను కూడా పోస్టర్ లో చూపించి ఇది మిడిల్ క్లాస్ కుర్రాడి కథ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

ఇవాళ్టి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలైంది. పి.మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సెను హీరోయిన్ గా తీసుకున్నారు. వివేక్-మెర్విన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో తన మాస్ యాక్షన్ సినిమాలకు రామ్ కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చినట్టయింది.

17 Replies to “మాస్ మత్తు వదిలేసిందా..?”

  1. సీనియర్ లను వదిలేస్తే… మాస్ చేయాలి అంటే విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండాలి. అప్పుడే ఏం చేసినా… కన్విన్సింగ్ గా.. నమ్మబుల్ గా ఉంటుంది.

    ప్రభాస్ గారు, Jr ఎన్టీఆర్ గారు, బన్నీ గారు, చెర్రీ గారూ, మహేష్ గారూ అండ్ పవన్ గార్లకు చెల్లుతుంది. మిగతా వారికి కష్టమే

      1. అందులో తప్పేం ఉంది. తనకి లేని దానిని… తాను చేయాలనుకున్న పని కోసం… తమ డబ్బులు పెట్టే సర్జరీ చేయించుకున్నారు.. మనకు జాబ్ కావాలంటే… మనకు లేని స్కిల్స్ నీ డబ్బులు పెట్టి నేర్చుకోవట్లా? దానిని తప్పు అంటే ఎలా

  2. ఆ బోడి.. ఎప్పుడో అరవై ఏళ్ల ntr పదహారేళ్ల శ్రీదేవి తో కాలేజీ కుర్రాడిలా పార్కుల్లో గెంతులు వేసేడు.. ఇదో పెద్ద లెక్కా…

Comments are closed.