రేష‌న్ బియ్యం లారీ సీజ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక‌వైపు రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై పెద్ద ఎత్తున ర‌చ్చ‌. మ‌రోవైపు ప్ర‌భుత్వం సీఐడీ ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా ఆగ‌డం లేదు. తాజాగా వైఎస్సార్ జిల్లా…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక‌వైపు రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై పెద్ద ఎత్తున ర‌చ్చ‌. మ‌రోవైపు ప్ర‌భుత్వం సీఐడీ ద‌ర్యాప్తున‌కు ఆదేశాలు ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా ఆగ‌డం లేదు. తాజాగా వైఎస్సార్ జిల్లా మైదుకూరులో అక్ర‌మంగా త‌ర‌లుతున్న లారీ రేష‌న్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. ఈ లారీని మైదుకూరు పోలీస్‌స్టేష‌న్‌లో అప్ప‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌తి జిల్లాలోనూ రేష‌న్ బియ్యం అక్ర‌మంగా త‌ర‌లిపోతున్నాయి. మైదుకూరులో చిక్కిన లారీ కూడా చెన్నైకి వెళుతున్న‌ట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ప్ర‌భుత్వం మారిందే త‌ప్ప‌, అక్రమాల్లో ఎలాంటి మార్పు రాలేద‌నేందుకు రేష‌న్ బియ్య‌మే ఉదాహ‌ర‌ణ‌.

పేద‌ల ద‌గ్గ‌ర త‌క్కువ ధ‌ర‌కు బియ్యాన్ని కొనుగోలు చేసి, వాటిని పాలిష్ చేసి విదేశాల‌కు త‌ర‌లిస్తున్నారు. విదేశాల్లో పెద్ద మొత్తానికి విక్ర‌యిస్తూ భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. అక్ర‌మార్కుల‌కు అధికారం అండ వుంటోంది. అధికారం ఉండేది అక్ర‌మంగా దోచుకోడానికే అనే అభిప్రాయం రాజ‌కీయ నాయ‌కుల్లో వుంది. అందువ‌ల్లే పాల‌కులు పైకి ఎన్ని నీతులు చెబుతున్నా, అక్ర‌మాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

కాకినాడ పోర్ట్ నుంచి అక్ర‌మంగా బియ్యం త‌ర‌లిస్తున్నార‌ని ఇప్పుడే ఏదో గుర్తించిన‌ట్టు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ హ‌డావుడి చేశారు. గ‌తంలో వైసీపీ నాయ‌కులు ఆ ప‌ని చేస్తే, ఇప్పుడు కూట‌మి నేత‌లు కొన‌సాగిస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ రేష‌న్ బియ్యాన్ని త‌ర‌లిస్తున్నార‌ని టీడీపీ అనుకూల మీడియాలో కూడా క‌థ‌నాల్ని చ‌ద‌వొచ్చు. చిక్కితే దొంగ‌, లేదంటే దొర‌. ఇదీ అక్ర‌మార్కుల నేటి స్థితి.

7 Replies to “రేష‌న్ బియ్యం లారీ సీజ్‌”

  1. ఏ రాయి ఐతే ఏంటి పళ్ళు రాలగొట్టుకోడానికి…. వీడు కాకపోతే వాడు… వాడు కాకపోతే వీడు

  2. ఇదేదో 50 ఎల్లా ముసలి lorryx కాబట్టి దొరికిపోయింది. అదే 20 ఏళ్ల వయసున్న పడుచు లోరిస్ అయ్యుంటే polices వారు lambhorginix తో వెంటాడినా దొరికేది కాదు.

Comments are closed.