రకరకాల వస్తువులు పార్శిల్ చేయడం గురించి తెలుసు. కానీ మనిషి మృతదేహాన్ని పార్శిల్ చేశారని తెలిస్తే…షాక్‌కు గురి అవుతాం. అలాంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సమాజంలో వింతపోకడలకు డెడ్‌బాడీని ఏకంగా పార్శిల్ చేయడమే నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళకు పార్శిల్ వచ్చింది. ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నట్టు పార్శిల్ తీసుకొచ్చిన వ్యక్తి ఆమెకు చెప్పారు. దీంతో ఆసక్తితో ఓపెన్ చేశారు. అందులో వచ్చిన పార్శిల్‌ను చూసి తులసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎలక్ట్రికల్ వస్తువుల కథ దేవుడెరుగు… అందులో మృతదేహం పార్శిల్‌గా రావడంతో తులసి ఆందోళన చెందారు.
పార్శిల్‌లో కుళ్లిన మృతదేహం రావడంతో చుట్టుపక్కల జనాన్ని పిలిచి చూపారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి తులసిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇంతకూ తులసికి డెడ్‌బాడీ ఎందుకు పంపారు? ఎవరు పంపారనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయమై సర్వత్రా చర్చ జరుగుతోంది.
పంపి నోడు ఎవడో కాని, o t t లో ఏదో థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూసుంటాడు
అదే నిజమైతే కొన్ని వెబ్ సిరీస్ వల్ల మంచి కంటే చెడు మాత్రమే ఎక్కువ జరుగుతుందనడానికి ఇదే రుజువు.
ఇందులో వింత ఏముందబ్బా ఆల్రెడీ మన అన్న పార్టీ నుండి ఒకరు డోర్ డెలివరీ చేసారు కదా అలాంటిదాన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని ఇంకో అడుగు వేసి పార్సెల్ చేసి పంపించారు ఏమో
Tdp Ippudu start parcel chesindaa door delivery naa leka inka emaina ?
బాత్రూం లో గొడ్డలిపోట్లు వేసి,శవాన్ని డోర్ డెలివరీ చెయ్యడం మావోడి బ్రాండ్.. A1 బ్రాండ్