పోలీస్ స్టేష‌న్‌లో అల్లుఅర్జున్‌!

సంధ్య థియేటర్ ఘటన కేసులో విచారణకు అల్లుఅర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు

సంధ్య థియేటర్ ఘటన కేసులో విచారణకు అల్లుఅర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, లాయర్‌తో కలిసి వెళ్లారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై అల్లుఅర్జున్‌ను పోలీసులు విచారించి, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.

పోలీస్ స్టేషన్‌లో సంధ్య థియేటర్ ఘటన దృశ్యాలు అల్లుఅర్జున్‌కు చూపించి, మరి విచారణ కొనసాగిస్తారని తెలుస్తోంది. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ ఆధ్వర్యంలో అల్లుఅర్జున్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా విచారించనున్నారు. అల్లుఅర్జున్ పోలీసులకు ఏమి చెబుతాడన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడిన మాటలపై కూడా అల్లుఅర్జున్‌ను ప్రశ్నించనున్నారు.

అంతకు ముందు మరోసారి పోలీస్ స్టేషన్‌కు అల్లుఅర్జున్ వెళ్తుండటంతో, ఆయన ఇంటి వద్ద కుటుంబ సభ్యుల్లో భయాందోళన కనపడింది. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరే ముందు ఆయన భార్య, కూతురు కారు వద్దకు రాగా, వారికి ధైర్యం చెప్పి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు.

సుమారు రెండు గంటల పాటు విచారణ జరగనున్న నేపథ్యంలో, అల్లుఅర్జున్ ఏమి చెబుతారు? అనే విషయం ఉత్కంఠ రేపుతోంది. పోలీసులు మ‌రోసారి విచార‌ణకు రమ్మంటారా? అనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది. విచారణ అనంతరం కేసు దశ ఏ మలుపు తిరుగుతుందో అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

10 Replies to “పోలీస్ స్టేష‌న్‌లో అల్లుఅర్జున్‌!”

  1. టికెట్ రేట్లు పెంచుకోవడానికి and బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినట్టు డ్రామా దె0గితే మండదా??

    అదే మావోడు అయ్యుంటే AA ఈపాటికే బాత్రూం లో గుండెపోటు తెచ్చుకునే వాడు

    1. అదే మా బొల్లి గాడు అయ్యుంటే ఈపాటికే వీడి ని లేపేసి.. అన్ని వేరేవాళ్ళ అకౌంట్ లో వేసే వాడు..ఇలా…

      మాధవ రెడ్డిలా నక్సలైట్స్ ఎన్కౌంటర్ లో పోయాడు

      ఎన్టీఆర్ లా .. గుండెపోటు తో పోయాడు…

      ఇంద్ర రెడ్డి లా ఆక్సిడెంట్ లో పోయాడు!

      రంగ లా… ప్రత్యర్ధులు చంపేశారు!

      రాంమూర్తి నాయుడు లా పిచ్చోడయిపోయి పోయాడు!

      ఇలా ఉంటాయి కథలు!

  2. ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలంటే త్రివిక్రమ్ గారిని అడుగు

    తగ్గేదేలే అంటే సుక్కు గారిని అడుగు

  3. ICON టీషర్ట్ వేసుకొని వెళ్ళాల్సింది కదా భాయ్, బ్రాండ్ ప్రమోషన్ కూడా పనికొచ్చేది

Comments are closed.