ఫేక్ డాక్యూమెంట్ తో ‘క్రాక్’ పుట్టించాడు

సినిమా నిర్మాణం కత్తి మీద సాము. సినిమాను సెట్ చేసుకోవడం ఓఎత్తు. నిర్మించడం మరో ఎత్తు. రెడీ అయినదానిని దిగ్విజయంగా జనాల్లోకి పంపడం ఇంకో ఎత్తు. ముఖ్యంగా ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెట్టి, ఫైనాన్స్…

సినిమా నిర్మాణం కత్తి మీద సాము. సినిమాను సెట్ చేసుకోవడం ఓఎత్తు. నిర్మించడం మరో ఎత్తు. రెడీ అయినదానిని దిగ్విజయంగా జనాల్లోకి పంపడం ఇంకో ఎత్తు. ముఖ్యంగా ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెట్టి, ఫైనాన్స్ తెచ్చి, తిరిగి చెల్లించడానికి కిందా మీదా కావడం అన్నది నూటికి తొంభై మంది నిర్మాతలకు తప్పదు. 

రాని బాకీలను వసూలు చేసుకోవడానికి కిందా మీదా కావడం అప్పులు ఇచ్చిన వారికీ తప్పదు. ఇలాంటి నేపథ్యంలో రుణాల వసూలుకు సామ, దాన, దండ, బేధోపాయాలు వాడేస్తుంటారు. అప్పు తీసుకున్నవారు కూడా తప్పించుకోవడానికి రకరకాల టెక్నిక్ లు వాడుతుంటారు. 

ఇలాంటి టామ్ అండ్ జెర్రీ పోరులో ఇప్పుడు ఓ కొత్త టెక్నిక్ తెలిసింది.సినిమా అన్నది ఇన్ టైమ్ లో విడుదల కావాలి. పెద్ద హీరో, పెద్ద సినిమా అనౌన్స్ చేసిన డేట్ కు విడుదల చేయకుంటే కోట్లలో నష్టం వస్తుంది. తమ సినిమా మీద కోర్టు స్టే పడింది అంటే ఇక అంతే సంగతులు. 

ఇలా స్టే రాకూడదనే బ్యానర్ మార్చి, నిర్మాత పేరు మార్చి రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు. అలా ఎన్నుకున్నా కూడా తెలివిగా దారిలోకి తెచ్చుకునే కొత్త మార్గం ఒకటి కనుగొన్నారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా మీద స్టే వచ్చింది. ఎలా ? తనకు బాకీ వున్నారు, ఆ సినిమా విడుదల టైమ్ లో ఇస్తామని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు అంటూ కోర్టులో కేసు వేస్తే. 

కానీ నిర్మాత ముందు జాగ్రత్తగా బ్యానర్ మార్చారు. ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఎలా వచ్చింది. అంటే అలా ఇచ్చిన అగ్రిమెంట్ కాగితం ఫేక్. దాంట్లో సంతకం ఫేక్. రెండు సంతకాలు చూసిన చిన్న పిల్లాడు కూడా ఈ రెండూ ఒకటి కావు అని చెబుతాడు. కానీ కోర్టుకు అదంతా అక్కరలేదు. వాడు కోర్టుకు వచ్చాడు. 

నువ్వు వచ్చి ప్రూవ్ చేసుకో అంటుంది. మరే వ్యాపారంలో అయినా టైమ్ వుంటుంది కాబట్టి పోరాడవచ్చు. కానీ ఇక్కడ సినిమా అనేదానికి అలాకాదు. ఒకసారి డేట్ వేసాక రాకపోతే ఫలితం చాలా దారుణంగా వుంటుంది. అందుకే ఆ వీక్ నెస్ కనిపెట్టి ఆ పెద్ద మనిషి ఈ ఫేక్ డ్రామా ఆడి నిర్మాతను దారికి తెచ్చుకున్నాడు.

నిజానికి ఇది నేరం. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, అదంతా తేలి, ఫేక్ అని ప్రూవ్ అయ్యేసరికి నెలలు గడిచిపోతాయి. సినిమా సంకనాకి పోతుంది. ఎలాగూ డబ్బులు ఇవ్వాలి కాబట్టి, చచ్చినట్లు చర్చల్లో కూర్చుని, రాజీకి వచ్చి, బాకీ తీర్చి, తమ సినిమా విడుదల చేసుకోవడమే.

డబ్బులు తరువాత తీరుద్దాం, ఇప్పుడు మెల్లగా ఏరు దాటేద్దాం అనుకోవడం నిర్మాత తప్పు. అలాంటి నిర్మాతను దారికి తేవడం కోసం ఇలాంటి మార్గం ఎన్నుకోవడం అప్పు ఇచ్చినవారి తప్పు. ఈ మార్గం ఇంక అందరూ అలవాటు చేసుకుంటే, ఇక రాను రాను చాలా సినిమాలు ఇబ్బందుల్లో పడతాయి.

దర్శకుడిగా మారుతున్న రవితేజ

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?