క్రాక్ కు హ్యాండిచ్చిన శృతి

తెలుగు సినిమాలు కావాలి. టాలీవుడ్ జనాలు ఇచ్చే భారీ రెమ్యూనిరేషన్లు కావాలి. కానీ సినిమాల విడుదల వచ్చేసరికి మాత్రం మొహం చాటేస్తారు.  Advertisement సినిమాకు ప్రచారం అంటే  పత్తా లేకుండాపోతారు. అయితే చెన్నయ్ లోనో,…

తెలుగు సినిమాలు కావాలి. టాలీవుడ్ జనాలు ఇచ్చే భారీ రెమ్యూనిరేషన్లు కావాలి. కానీ సినిమాల విడుదల వచ్చేసరికి మాత్రం మొహం చాటేస్తారు. 

సినిమాకు ప్రచారం అంటే  పత్తా లేకుండాపోతారు. అయితే చెన్నయ్ లోనో, లేకుంటే ముంబాయ్ లోనో కూర్చుని కాలక్షేపం చేసేస్తారు.లేటెస్ట్ గా శృతి హాసన్ ది కూడా ఇదే బాట. రవితేజ హీరోగా నిర్మించిన క్రాక్ సినిమాలో శృతినే హీరోయిన్. 

ఈ సినిమా పబ్లిసిటీకి శృతి దూరంగా వుండిపోయింది. సినిమా విడుదలకు ఇంక రెండు రోజులు గ్యాప్ మాత్రమే వుంది. కానీ శృతి జాడ మాత్రం లేదు. ఆమె ప్రస్తుతం ముంబాయిలో వుంటున్నారు.

సినిమా ప్రచారానికి ఆమె రావడం లేదని తెలుస్తోంది. సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హాజరుకావడం లేదు. కనీసం టీవీ ప్రచారానికో, మీడియా ప్రచారానికో కూడా రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఏమీ చేసేది లేక యూనిట్ మౌనంగా వుండిపోయింది. 

శృతి తెలుగులో సినిమా చేసి చాలా కాలం అయింది. లేటెస్ట్ గా చేసిన ఈ క్రాక్ మూవీకి మంచి బజ్ వచ్చింది. ఇలాంటి టైమ్ లో నిర్మాతకు కాస్త కోపరేట్ చేసి సినిమాకు మరింత ఊపు తీసుకువస్తే బాగుండేది. కానీ అలా చేయాలన్న ఆలోచనే వున్నట్లు కనిపించడం లేదు.

నీకు ఉన్నదల్లా కుల పిచ్చే !!!

టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి